ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

తాడికొండ నియోజకవర్గం

తాడికొండ నియోజకవర్గం, గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. కృష్ణా తీరం మరియు పచ్చని పొలాలతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ప్రాంతం ఇది. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కువ మొత్తంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 179080 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 90721 కాగా మగవారి సంఖ్య 88351. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పత్తి మరియు మిర్చి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు.

ప్రసిద్ధ ప్రదేశాలు:

  • కోదండ మల్లికార్జున స్వామీ వారి దేవస్థానము
  • అంకాలమ్మ ఆలయం

నియోజకవర్గపు ప్రముఖులు:

శ్రీ గోగినేని నాగేశ్వరరావు గారు - గ్రామాభివృద్ధికి విశేషకృషి చేసిన ఈయన స్మరణార్ధం, తాడికొo శ్రీ గోగినేని కనకయ్య గాంధీ పార్కులో ఈయన శిలావిగ్రహం నిర్మించారు.

నియోజకవర్గపు సమస్యలు:

  • తాడికొండ సెగ్మెంట్ ప్రతి మండలంలో మంచినీటి సమస్య.
  • రాజధాని రైతు కుటుంబాలకు అందని ఉచిత విద్య, వైద్యం.
  • ఎక్స్ ప్రెస్ రోడ్ల పేరుతో ఇళ్ల తొలగింపుపై ఆందోళన.
  • లాం దగ్గర వంతెన లేక గుంటూరు రూట్లో ఇబ్బందులు.
  • ఇరుకు రోడ్లు మరియు పారిశుధ్య లేమి నియోజకవర్గపు ప్రధాన సమస్యలు.
Top