ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

తిరుపతి నియోజకవర్గం

నగర శివార్లలోని అర్బన్పంచాయతీలతో తిరుపతి నియోజకవర్గం మమేకమై ఉంది. గతంలో తిరుపతి గ్రామీణ, అర్బన్మండలంలోని 20 పంచాయతీలు నియోజకవర్గంలో కలిసి ఉండేవి. పునర్విభజన తరువాత మండలంలోని 17 పంచాయతీలు చంద్రగిరి నియోజకవర్గంలో కొత్తగా చేరాయి. దీంతో అర్బన్పంచాయతీలైన ముత్యాలరెడ్డిపల్లె, తిమ్మినాయుడుపాళెం, రాజీవ్నగర్లాంటిమేజర్పంచాయతీలు తిరుపతిలో చేరాయి. నగరం దాదాపు 17 కిలోమీటర్లు విస్తరించి ఉంది. తిమ్మినాయుడుపాళెం పరిధిలో 40 హెక్టార్ల వ్యవసాయ భూములు ఉన్నాయి.

నగరంలో జనాభా సంఖ్య పెరుగుతుండడంతో మహానగరాలవలే అపార్ట్మెంట్ల సంస్కృతి పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, తితిదే ఉద్యోగులు ఇక్కడ అధికంగా నివాసం ఉంటున్నారు. మిగిలిన వారు స్థానికంగా వివిధ వ్యాపారాలు, రియల్ఎస్టేట్రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. తిరుపతి ఆలయాలకు ప్రసిద్ధి కావడంతో రోజు దాదాపు 60 వేల మంది యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. తద్వారా హోటళ్లు, వైద్య రంగాలు అనతి కాలంలోనే బాగా అభివృద్ధి చెందాయి. తిరుపతి నియోజకవర్గానికి ఆనుకుని తూర్పుదిక్కుగా శ్రీకాళహస్తి, పడమర దిక్కుగా చంద్రగిరి వంటి పేరెన్నికగన్న నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇది మునిసిపల్ కార్పొరేషన్ మరియు తిరుపతి (పట్టణ) మండల, మరియు తిరుపతి రెవెన్యూ డివిషన్ యొక్క ప్రధాన కార్యాలయం. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఇది 374,260 జనాభాను కలిగి ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదవ అత్యధిక జనాభా కలిగిన నగరంగా ఉంది. ఇది రాష్ట్రంలో ఏడో అతి పెద్ద పట్టణ ప్రాంతం, ఇది 459,985 జనాభాతో ఉంది.

సమస్యలు

  • తిరుమల బాలాజీ నగరం నందు స్థానికులకు హాస్పిటల్ కల్పిస్తుంది త్రాగునీటినీ ఏర్పాటు చేయాలి
  • తిరుమలలోని స్థానికుల అవసరాల మేరకు కొన్ని వస్తువులను టీటీడీ వారు తిరుమలకు అనుమతించాలి
  • తిరుపతి అధిక ధరలను నియంత్రించాలని ప్రయాణికులు వినతి
  • ట్రాఫిక్ సమస్యలు
  • తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు
Top