పాత వాల్మీకిపురం నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు కొత్తగా పీలేరు మండలం కలుపుకుని పునర్విభజనలో పీలేరు నియోజకవర్గం ఏర్పడింది. నియోజవర్గానికి తూర్పు, దక్షిణాన పుంగనూరు, పడమర మదనపల్లె, తంబళ్లపల్లె, ఉత్తరాన కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గాలు ఉన్నాయి. పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, గుర్రంకొండ నాలుగు మేజర్, 93 మైనర్ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో అభివృద్ధి చెందుతున్న పంచాయతీలో పీలేరుకు గుర్తింపు ఉంది. జూనియర్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉన్నాయి. రాయచోటి, చిత్తూరు, తిరుపతి, మదనపల్లె, పట్టణాలు పీలేరు నుంచి 55 కి.మీ. దూరంలో ఉండడంతో అభివృద్ధి చెందేందుకు అవకాశం వచ్చింది. కలికిరి టమోటో మార్కెట్కు జిల్లాలోనే గుర్తింపు ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మార్కెట్ నడుస్తోంది. గుర్రంకొండలో ప్రభుత్వ స్థలం ఉన్నా యార్డ్ నిర్మించనందున ఖాళీ స్థలంలో ఏర్పాటుచేశారు.
పిళ్ళూరు అసెంబ్లీ నియోజకవర్గం - పిళ్ళూరు విదర్స సభ (163) ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉంది మరియు రాజపట్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం 286468 జనాభాలో 85.52% గ్రామీణ మరియు 14.48% పట్టణ జనాభా.