ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

సత్యవేడు నియోజకవర్గం

సత్యవేడు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. సత్యవేడు, వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ, కేవీబీపురం, పిచ్చాటూరు, నాగలాపురం, నారాయణవనం మండలాలు నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి. అంతకు మునుపు నియోజకవర్గ పరిధిలో ఉన్న నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలాన్ని జిల్లాకే పరిమితం చేశారు. తొట్టంబేడులోని ఏడు పంచాయతీలను కూడా ఇక్కడ నుంచి విడదీసి శ్రీకాళహస్తిలోకి చేర్చారు.

తమిళ ప్రభావం అధికంగా ఉన్న నియోజకవర్గంలో తూర్పున తమిళనాడు, పడమర శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఉత్తరాన నెల్లూరు జిల్లా, దక్షిణాన నగరి నియోజకవర్గాలు ఉన్నాయి. అరణియార్ప్రాజెక్టు ద్వారా నాగలాపురం, పిచ్చాటూరు మండలాల రైతులకు సాగునీటి సౌకర్యం మెండుగా ఉంది. నియోజకవర్గం సుమారు 747 చదరపు కి.మీల విస్తీర్ణంలో ఉంది. వ్యవసాయమే జీవనాధారంగా ఇక్కడ పరిస్థితి నెలకొంది. చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేకపోవడంతో రైతులు వర్షాన్నే మూలాధారంగా చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఆరణియార్ప్రాజెక్టు ప్రస్తుతం ఆధునికీకరణ చేస్తున్నారు. కేవీబీపురం మండలంలోని కాళంగి ప్రాజెక్టుకు లీకేజీల బెడద తప్పడం లేదు. నాగలాపురంలో భూపతేశ్వర కోన ప్రాజెక్టు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడి యువకులు అనేక మంది సమీప తమిళనాడు ప్రాంతంలో వివిధ ప్రైవేటు ఫ్యాక్టరీలలో ఉపాధి పొందుతున్నారు. నియోజకవర్గంలో రైలు మార్గం లేదు. స్థానికంగా ఆర్టీసీ డిపో ఉండటం వల్ల చిరువ్యాపారులు చెన్నై ప్రాంతానికి వెళ్లి సరుకులు తీసుకునివచ్చి ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. గత ఏడాది సుమారు 6వేల ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే ఫ్యాక్టరీల నిర్మాణాలు మొదలవుతున్నాయి. 

2011 జనాభా లెక్కల ప్రకారం, పట్టణం మొత్తం జనాభాలో 52,979 మంది ఉండగా, 25,995 పురుషులు మరియు 28,984 మంది మహిళలు ఉన్నారు. ఇది సత్యవేడు నియోజకవర్గం యొక్క భాగం, ఇది మొత్తం జనాభా 2,77,010.

సమస్యలు

  • సత్యవేడు నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య
  • తాగునీటి సమస్యలు
  • ట్రాఫిక్ సమస్యలు
Top