ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కుప్పం నియోజకవర్గం

కుప్పం ప్రాంత రాష్ట్రంలో రాయలసీమలో ఉంది. పశ్చిమాన, ఉత్తరాన కర్ణాటక రాష్ట్రపు కోలార్ జిల్లా, దక్షిణాన తమిళనాడుకు చెందిన కృష్ణగిరి జిల్లా ఉన్నాయి. "కుప్పం" అంటే కలసే స్థలం.[2] ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు - మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిసే స్థలంగా ఉన్నందున కుప్పంలో వివిధ సంస్కృతుల, భాషల ప్రభావం కనిపిస్తుంది.

కుప్పం గ్రామం 12 45 ఉత్తరం, 78 20 తూర్పు అక్షాంశరేఖాంశాలవద్ద ఉంది. సమీపంలోని మొత్తం 5 మండలాలలో జనాభా సుమారు 612 జనావాసాలు, 62,400 ఇళ్ళు, 3 లక్షల మంది జనాభా ఉన్నారు.

వ్యవసాయం ఇక్కడి ప్రధాన వృత్తి. కుప్పం నియోజికవర్గం శాంతిపురం మండలంలో పాలారు నది ప్రవహిస్తున్నది. ఇక్కడి సగటు వర్షపాతం 840 మి.మీ. మొత్తం నియోజక వర్గంలో 63,000 హెక్టేరులు సాగుభూమి (50.4%) మరియు 41,987 హెక్టేరులు అడవి భూమి (33.7%) ఉంది.

కుప్పం పరిసర ప్రాంతాలలో గ్రానైట్ క్వారీలు ఎక్కవగా ఉన్నాయి. ఒక విధమైన గ్రానైట్ను "కుప్పం గ్రీన్" అని వ్యవహరిస్తారు. ఇక్కడినుండి మొదటి నల్ల గ్రానైట్ రాయి 1925లో యు.కె.కు ఒక సమాధిరాయి నిమిత్తం 1925లో ఎగుమతి అయ్యింది.

కుప్పం నియోజక వర్గం మూడు రాష్రాల కూడలి, అనగా ఆంధ్రప్రదేశ్కర్నాటక మరియు తమిళనాడులు ఇచ్ఛట కలుస్తాయి. ఇక్కడినుండి బెంగళురుకు 105 కి.మీ., చెన్నైకు 250 కి.మీ.

నియోజక వర్గంలో 455 పాఠశాలలు, 1 విశ్వవిద్ద్యలయం (ద్రావిడ విశ్వవిద్ద్యలయం, Dravidian University), 1 ఇంజినీరింగ్ కాలేజి, ఒక మెడికల్ కాలేజి, 1 పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. అక్షరాస్యత 61% ఉంది.

చాలా కాలంగా వెనకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియొజికవర్గం గత పది సంవత్సరాలలో దాదాపుగా అన్ని గ్రామాలలో పాఠశాలలు నెలకొల్పబడి అబివృధి ఛెందుతొంది. ఈ నియొజికవర్గంలో చెవిటి మరియు మూగ వారికి ప్రత్యేకమైన పాఠశాల విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్ వారి ఆధ్వర్యంలో నడపబడుచూ, నియొజికవర్గం లోని వికలాంగుల సంక్షేమంలో పాలుపంచుకుంటున్నది.

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం - కుప్పం విధానసభ (175) ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉంది మరియు చిత్తూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం 285123 జనాభాలో 92.3% గ్రామీణ మరియు 7.7% పట్టణ జనాభా ఉన్నారు.

సమస్యలు

  • కుప్పం నియోజకవర్గంలో రోడ్లు పరిస్థితి దారుణం
  • కుప్పం నియోజకవర్గంలో నిరుద్యోగ పరిస్థితి
  • కుప్పం నియోజకవర్గంలో ఇల్లు సాంక్షన్కా కానీ పబ్లిక్
Top