ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

తంబళ్లపల్లె నియోజకవర్గం

చిత్తూరు, కడప, అనంతపురం సరిహద్దుల్లో తంబళ్ళపల్లె నియోజకవర్గం ఉంది. తూర్పున వాల్మీకిపురం నియోజకవర్గం (గుర్రంకొండ మండలం) పడమర కర్ణాటక రాష్ట్రం (శ్రీనివాసపురం తాలూకా, కోలారుజిల్లా), ఉత్తరాన కడప జిల్లా రాయచోటి, అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గాలు, దక్షిణాన మదనపల్లె ఉన్నాయి. పునర్విభజన అనంతరం బి.కొత్తకోట, కురబలకోట మండలాలు పూర్తిగా కలిశాయి. పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, తంబళ్ళపల్లె, పెద్దమండ్యం మండలాలు గతం నుంచీ ఉన్నాయి.

కరవు పీడనలో ఉన్న నియోజకవర్గం బి.కొత్తకోట కలవడంతో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో వాణిజ్య వ్యాపార రంగాల్లో అభివృద్ధికి అవకాశం ఏర్పడింది. వ్యవసాయ రంగంలో కుంటుపడిన నియోజకవర్గానికి రెండు మండలాలు కొత్తరూపు ఇచ్చాయి. జాతీయ పర్యాటక కేంద్రంగా ఉన్న హార్సిలీహిల్స్నియోజవర్గంలో చేరడంతో జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందే అవకాశం ఏర్పడింది. ఆంధ్ర వూటీగా పిలువబడే ప్రదేశం. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఏర్పడింది. నియోజకవర్గానికి ఆర్థిక వనరులు సమకూరేందుకు కురబలకోట మండలం పూర్తిస్థాయిలో సహకరించనుంది. మండలంలోని విద్యాసంస్థల ప్రభావంతో విద్యాపరంగా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది. మండలంలోని రిషివ్యాలీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఇక్కడి రివర్విద్యావిధానం నియోజకవర్గానికి తలమానికం కానుంది.

సమస్యలు

  • తంబళ్లపల్లె లో నీటి సమస్యలు
  • పరిశ్రమలు లేవు
  • చేయూత కోసం టెర్రకోట కళాకారులు ఎదురుచూపులు
Top