చంద్రగిరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు నియోజకవర్గం కు చెందిన ఒక నియోజకవర్గం. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు చే నిర్మించబడిన చంద్రగిరి కోట 1640లో నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి. చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచేవారు.ఇలా నిర్మించడం వలన కోట రక్షణ కొండ ప్రాంతం వైపు తగ్గలేదని కొండపై నుండి శత్రువుల కదలికలను దూరంనుండి గమనించుట సులభం కనుక కొండ పక్కగా నిర్మించారని మ్యూజి యంలో సమాచారం ద్వారా తెలుస్తుంది . కోట చుట్టూ దాదాపు కిలోమీటరు దూరంలో దృఢమైన గోడకలదు ఈ గోడను నిర్మించేందుకు ఉపయోగించిన రాళ్ల పరిమాణం చాలా పెద్దది అందుకనే దీనిని ఏనుగుల సహాయంతో నిర్మించారని తెలుస్తుంది.
పునర్విభజన తరువాత ఏర్పడిన చంద్రగిరి నియోజకవర్గం సరిహద్దుల విషయంలో పలు ప్రత్యేకతల్ని సంతరించుకుంది. అయిదు నియోజకవర్గాలు.. కడప జిల్లా సరిహద్దుల మధ్య ఉంది. ఈ నియోజకవర్గం నుంచి పులిచెర్ల, ఐరాల మండలాలు విడిపోయాయి. పాత నియోజకవర్గంలోని చంద్రగిరి, పాకాల మండలాలతో పీలేరు నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళ్యం, పుత్తూరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం, తిరుపతిలోని రూరల్ పాక్షికంగా కలిసి కొత్త నియోజకవర్గ రూపాన్ని సంతరించుకుంది. నగరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పుంగనూరు, పీలేరు, కడప జిల్లా సరిహద్దు ఉన్నాయి. అయితే నియోజకవర్గ పేరును మాత్రం చంద్రగిరిగానే కొనసాగిస్తున్నారు.
అత్యధిక జనాభా కలిగిన నియోజకవర్గాల జాబితాలో చంద్రగిరి కూడా స్థానం పొందింది. చంద్రగిరిలో ఈ నియోజకవర్గం సుమారు వంద కి.మీ.ల పరిధిలో విస్తరించి ఉంది
చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం - చంద్రగిరి విధానసభ (166) ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు నియోజకవర్గం లో ఉంది మరియు చిత్తూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం 340234 జనాభాలో 74.64% గ్రామీణ, 25.36% పట్టణ జనాభా.