ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

చిత్తూరు నియోజకవర్గం

ఇటు తమిళనాడు.. అటు కర్ణాటక నుంచి రాష్ట్రానికి ముఖద్వారంగా ఉన్న చిత్తూరు నైసర్గికంగా వైవిధ్యభరితమైన ప్రాంతం. చెన్నై-బెంగళూరు నాలుగో నెంబరు, చిత్తూరు-కర్నూలు 18 నెంబరు జాతీయ రహదారి చిత్తూరు మీదుగా వెళతాయి. ఇక్కడకు తమిళనాడు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం ఇక్కడి నుంచి 12 కిమీలే. ప్రముఖ సీఎంసీ ఆసుపత్రి 35 కిమీల దూరంలోనే ఉంది. తిరుపతి, వేలూరు స్వర్ణదేవాలయం వెళ్లేందుకు ఇది కూడలి. చిత్తూరుకు దక్షిణాన ఉన్న గుడిపాల తమిళనాడు సరిహద్దులో ఉండగా, పశ్చిమాన బంగారుపాళ్యం, యాదమరి, ఉత్తరంలో తవణంపల్లె, పూతలపట్టు, తూర్పున పెనుమూరు, గంగాధరనెల్లూరు ఉన్నాయి.

నియోజకవర్గంలో జనాభా 2.52 లక్షలు. నియోజక వర్గం విస్తీర్ణం 35 వేల హెక్టార్లు. పట్టణం మధ్యలో ఉన్న కొండలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పట్టణంలోని గంగినేని, కట్టమంచి చెరువు ప్రధాన నీటి వనరులు. నీవానది పడమర నుంచి తూర్పుదిశగా ప్రవహిస్తుంది. దీనిపై కట్టమంచివద్ద రోడ్డు, రైలు బ్రిడ్జీలు ఉన్నాయి. పట్టణ శివారులోని అటవీప్రాంతాన్ని రిజర్వు ఫారెస్టుగా గుర్తించారు. ఇందులో అత్యంత అరుదైన శ్రీగంధం, విదేశాల్లో మంచి డిమాండు ఉన్న ఎర్రచందనం ఉన్నాయి. అటవీప్రాంతం జింకల నివాసానికి ఆలవాలం. పట్టణం మధ్యలోని రైల్వే ఓవర్బ్రిడ్జి ట్రాఫిక్తో కిటకిటలాడుతుంటుంది. రహదారులు అడ్డదిడ్డంగా ఉండటం.. ప్రధాన వ్యాపార కూడళ్లు అయిన చర్చివీధి, పొన్నియమ్మగుడి ప్రాంతాలు ఇరుకైనవి కావడం వల్ల జనం ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

2011 జనాభా లెక్కల ప్రకారం, చిత్తూరు జిల్లాలో 4,170,468 మంది జనాభా ఉన్నారు. [ఇది భారతదేశంలో (640 మొత్తంలో) మరియు దాని రాష్ట్రాల్లో 6 స్థానాన్ని ఇచ్చింది. [  జిల్లాలో జనసాంద్రత 275 చదరపు కిలో మీటర్లు (710 / sq mi) ఉంది. [10] 2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు 11.33%. ప్రతి 1000 మంది పురుషులు, మరియు 72.36% అక్షరాస్యత రేటుకు 1002 మంది స్త్రీలకు లింగ నిష్పత్తి ఉంది

సమస్యలు

  • చిత్తూరు నియోజకవర్గంలో రోడ్లు పరిస్థితి దారుణం
  • చిత్తూరు నియోజకవర్గంలో చెరువులను సంరక్షించాలి
  • చిత్తూరు నియోజకవర్గంలో చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయాలి
  • ముస్లింల కోసం సబ్ ప్లాన్ తీసుకొని రావాలి
Top