ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

గంగాధరనెల్లూరు నియోజకవర్గం

కొత్తగా ఏర్పడిన గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఆంధ్రతోపాటు తమిళనాడు సరిహద్దునూ కలిగి ఉంది. నియోజకవర్గంలోని పాలసముద్రం, కార్వేటినగరం, శ్రీరంగరాజపురం మండలాలు తమిళనాడు భూభాగాన్ని ఆనుకుని ఉన్నాయి. ఉత్తర ఆర్కాట్టులోని పళ్లిపట్టు తాలూకా జీడీనెల్లూరుకు సరిహద్దుగా ఉంది. జిల్లాలోని పూతలపట్టు, చంద్రగిరి, చిత్తూరు, నగరి నియోజకవర్గాలు గంగాధర నెల్లూరుకు వివిధ దిశల్లో ఉన్నాయి. తూర్పు భాగంలో నగరి, పడమర దిశలో పూతలపట్టు, నైరుతిలో చిత్తూరు, చంద్రగిరి నియోజకవర్గాలుఉన్నాయి.

సుమారు 9 వందల చదరపు కి.మీ.లో నియోజకవర్గం విస్తరించి ఉంది. అన్నిటికంటే ఎక్కువగా జీడీనెల్లూరు మండలం సుమారు 185 .కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది. తక్కువగా పాలసముద్రం 90 .కి.మీ. కలిగి ఉందిచిత్తూరు పట్టణానికి తాగునీరు అందించే ఎన్టీఆర్జలాశయం పెనుమూరు మండలంలో ఉంది. ప్రసిద్ధి చెందిన పాళ్యం అడవులు ఇక్కడే ఉన్నాయి. చూపరులను ఆకర్షించే పులిగుండు ఇక్కడి ప్రత్యేకత. ఇది సుమారు 500 అడుగుల ఎత్తు ఉంటుంది

గంగాధర నెల్లూరు (SC) అసెంబ్లీ నియోజకవర్గం - గంగాధర నెల్లూరు (SC) Vidhan Sabha (171) ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉంది మరియు చిత్తూరు (SC) లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, 268282 జనాభాలో 100% గ్రామీణ మరియు 0% పట్టణ జనాభా.

సమస్యలు

  • గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సాగునీటి సమస్యలు
  • గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు
  • చెరువులకు మరమ్మత్తులు చెయ్యాలి
  • వ్యవసాయానికి సాగునీటి కొరత
  • దళితులకు ప్రత్యేక ప్రవేశం లేదు
Top