ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

నగరి నియోజకవర్గం

నగరి అన్న పదమే నలువైపులా గిరులు కలిగిన ప్రాంతంగా నానుడి. ప్రసిద్ధి చెందిన కైలాసకొండగా పిలిచే కాకముఖ కొండ గతంలో సముద్రతీరంలో నావలకు దిక్సూచిగా కొండ శిఖరాగ్రాన దీపం వెలిగించేవారని చరిత్ర చెబుతోంది. శ్రీకృష్ణదేవరాయులు కాలంలో కార్వేటినగరం సంస్థానాదీశులు కొండపై దీపం వెలిగిచేందుకు గాను నారాయణవనం మండలంలో కొందరిని నియమించారు. వారికి మాన్యాలు ఇచ్చి దీపం వెలిగించేవారు. ప్రస్తుతం ప్రతి పౌర్ణమికి అక్కడ దీపం వెలిగించడం ప్రత్యేకత. నగరి నియోజకవర్గం చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దులో ఉన్నందున దక్షిణాన తమిళనాడు, తూర్పున సత్యవేడు నియోజకవర్గం, పశ్చిమాన గంగాధరనెల్లూరు నియోజకవర్గం, ఉత్తరాన తిరుపతి నియోజకవర్గాలుఉన్నాయి. నియోజకవర్గం 205 జాతీయ రహదారిని అనుసరిస్తూ సరిహద్దు నుంచి వడమాలపేట మండలం వరకు సుమారు 34 కి.మీ ఉంది. నగరి నియోజకవర్గానికి దక్షిణం వైపు తమిళనాడు ఉన్నందున తమిళులు అధికంగా ఉన్నారు. నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 507 .కిలోమీటర్లు. భౌగోళికంగా కొండలు, గుట్టలు అధికంగా ఉన్నాయి. చెప్పుకోదగ్గ ప్రధాన కొండ కైలాసకొండ. దీనికి దక్షిణం వైపు నగరి, నిండ్ర మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో కాకముఖ కొండలో దట్టమైన అడవులున్నాయి. నియోజకవర్గంలో కుశస్థలి నది, అరుణానది ప్రవహిస్తున్నాయి.

 ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అధికంగా గుట్టలకింద మెట్టభూములు కలిగి ఉన్నాయి. మెట్టభూముల్లో మామిడి తోటల సాగుపై రైతులు ఆధారపడి ఉన్నారు. నగరి కుశస్థలిలో సత్రవాడ నుంచి విజయపురం మండలం కనకమ్మసత్రం వరకు ఇసుక అటు తమిళనాడు, ఇటు చిత్తూరు జిల్లా వాసులకు సరఫరా అవుతుంది. నగరి, పుత్తూరు మధ్య కన్నాంమిట్ట కొండల వద్ద క్వారీలకు అనువుగా తెల్లరాళ్ల కొండలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో చంద్రగిరి తర్వాత నగరిలోనే క్వారీల సంఖ్య అధికం.

నాగరి అసెంబ్లీ నియోజకవర్గం - నాగరి విధానసభ (170) ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉంది మరియు చిత్తూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం 266766 జనాభాలో 56.39% గ్రామీణ మరియు 43.61% పట్టణ జనాభా.

సమస్యలు

  • నగరి నియోజకవర్గంలో త్రాగు నీటి సమస్యలు
  • నగరి నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య
Top