ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పలమనేరు నియోజకవర్గం

తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో.. సమాంతర దూరంలో ఏర్పడినదే పలమనేరు నియోజకవర్గం. నియోజకవర్గ కేంద్రమైన పలమనేరుకు ఖచ్చితంగా 150 కి.మీ. దూరంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రాజధానులుండటంతో వ్యాపారపరంగా పలమనేరు అమిత ప్రాముఖ్యత సంతరించుకుంది. వ్యాపారాల నిమిత్తం ఇక్కడి ప్రజలు ప్రతిరోజు వెళ్లి వస్తుండటం ఆనవాయితీగా మారింది. నాలుగో నెంబరు జాతీయ రహదారి పలమనేరు మీదుగా వెళుతుండటంతో వాణిజ్యపరమైన రాకపోకలు ఇతర ప్రాంతాలకు సైతం నియోజకవర్గం మీదుగా జరుగుతున్నాయి. ఇక్కడ అత్యధికంగా ఉత్పత్తి అయ్యే చింతపండు, వేరుసెనగ తదితర పంటల్ని ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడికే వచ్చి భారీ ఎత్తున కొనుగోలు చేస్తుండటం ఆనవాయితీగా మారింది. పలమనేరు నియోజవర్గంలో ఉత్పత్తి అయ్యే పట్టును రైతులు కర్ణాటక రాష్ట్రంలో విక్రయించడం జరుగుతోంది.

నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అప్పటి వరకు కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో ఉన్న వి.కోట, పెద్దపంజాణి మండలాలు పలమనేరు నియోజకవర్గంలో వచ్చి చేరాయి. నియోజకవర్గం మొత్తం 750 చదరపు కి.మీ. మేర విస్తరించి ఉండగా ఇందులోని అయిదు మండలాలు ఒక్కొక్కటి దాదాపు 150 చదరపు కి.మీ. పరిధిలో ఉన్నాయి. కుప్పం, పుంగనూరు, చిత్తూరు నియోజకవర్గాలుపలమనేరుకు అత్యంత సమీపంలోనే ఉన్నాయి. 

 పాలమనేర్ అసెంబ్లీ నియోజకవర్గం - పాలమన్ విధాన సభ (174) ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉంది మరియు చిత్తూరు (SC) లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం 340935 జనాభాలో 84.15% గ్రామీణ, 15.85% పట్టణ జనాభా.

సమస్యలు

  • పలమనేరునియోజకవర్గంలో సాగునీటి సమస్యలు
  • పలమనేరు భూసేకరణ సమస్య న్యాయ వివాదాల పలని పనులు ఆలస్యం
  • మార్కెటింగ్ సమస్య
  • పరిశ్రమలు లేవు
  • ట్రాఫిక్ సమస్యలు
Top