ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పుంగనూరు నియోజకవర్గం

పుంగనూరుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన పట్టణము.  ఊరికి "Temple town" అని ముద్దు పేరు ఉంది. ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. బ్రిటిష్ హయాములో రాజ్యం చేసిన దొరల కోట ఒకటి వూళ్ళో ఉంది. అలాగే అమర శిల్పి జక్కన్నకుమారుడు ఒకే ఒక రాత్రిలో చెక్కిన ఒక పెద్ద కళాత్మకమైన కోనేరు కూడా ఉంది. ఇక్కడ ఎటా జరిగే గంగమ్మ జాతర ఎంతో ప్రాముఖ్యత గలది. జాతరకు కర్ణాటకతమిళనాడు  నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు.పుంగనూరు చింతపండు మరియు పశువుల వ్యాపారంలో దేశం లోనే ప్రఖ్యాతి గాంచింది. మరియు తాలూకాలో ప్రసిద్ధి చెందిన బోయకొండ గంగమ్మదేవస్థానం ఉంది. పుంగనూరు అసలు పేరు పరుశురామక్షేత్రం. కాల గమనంలో పుంగ పురంగా మారి నేడు పుంగనూరుగా పిలువ బడు తున్నది. తిమ్మ రాయలు సంతతి వారు పుంగ నూరు జమీందారలుగా వుండే వారు.

1866 లో సంస్థానంలో ఒక అందమైన రాజ భవనాన్ని నిర్మీంచారు. స్వాతంత్ర్యానంతరం జమీందారి వ్వవస్థ రద్దు కావడంతో జమీందార్లు బెంగుళూరుకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. దాంతో రాజ మహలు కళా హీనమై వన్నె కోల్పోయింది. ఒకప్పుడు మహల్ లో గ్రంథాలయం, మ్యూజియం వుండేవి. కాల క్రమంలో అవి కనుమరుగయ్యాయి. ప్యాలెస్ వెనుక భాగంలో అత్యంత కళాకాంతులుతో వున్న కళ్యాణ మంటపం ఉంది. గత వైభవానికి సాక్షిగా ఇది ఇంకా నిలబడి ఉంది. ఇక్కడే ఒక బావి ఉంది. గతంలో నేరస్తులకు మరణ సిక్ష విధించి బావిలో వడవేసె వారని వారి ఆత్మలు ప్రస్తుతం మహల్ లో తిరుగుతున్నాయని ఇక్కడి జనుల నమ్మకం. దానికి నివారణగా "అస్టబందం" అనే మంత్రాన్ని చక్కలపై చెక్కించి గోడలకు తగిలించే వారు. అవి నాటికి ఉన్నాయి. రాజ ప్రసాదంనుండి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న నక్కల బండ వరకు సొరంగ మార్గం వుండేదని, అదిప్పుడు పూడుక పోయిందని అంటారు. ప్రస్తుతం రాజ మహల్ శిథిలావస్థలో ఉంది.

పుంగనూరు చిత్తూరు జిల్లాలోని ఒక మున్సిపాలిటీ నగరం. పుంగనూర్ నగరం 31 వార్డులుగా విభజించబడింది, ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. పుంగనూర్ మున్సిపాలిటీలో 54,746 మంది జనాభా ఉన్నారు, వీటిలో 27,235 మంది పురుషులు ఉన్నారు, సెన్సస్ ఇండియా 2011 లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 27,511 మంది స్త్రీలు ఉన్నారు.

సమస్యలు

  • పుంగనూరు నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణం
  • పుంగనూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఇల్లు సమస్య
  • పుంగనూరు లో తాగునీటి సమస్యలు
  • పుంగనూరు లో ట్రాఫిక్స మస్యలు
Top