ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ప్రకాశం

ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో బంగాళాఖాతానికి  పశ్చిమాన, సముద్ర తీర ప్రాంతంలో ఉంది. ఒంగోలు జిల్లా కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 3,392,764 మంది ప్రజలు నివసిస్తున్నారు. జిల్లా అక్షరాస్యత 68.%. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో ఈ జిల్లా స్థూల ఉత్పత్తి 35,962  కోట్లు. ఇది రాష్ట్ర  స్థూల అభివృద్ధి సూచీలో 6.%. జిల్లా సగటు తలసరి ఆదాయం 85,765 రూపాయలు. జిల్లా ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వరి, పొగాకు, మిర్చి, పాలు, చేపలు, మాంసం , ఆకుకూరలు ఇక్కడి ప్రధాన పంటలు.  పారిశ్రామిక, సేవా రంగాలు, నిర్మాణ రంగం, చిన్న తరహా ఖనిజ పరిశ్రమలు, చిరు వ్యాపారాలు ఇతోధిక సంఖ్యలో ఈ జిల్లాకు ఆదాయం సమకూరుస్తుంది. 

ఈ జిల్లాలో 1,286.155 రోడ్డు మార్గం,కలిగి, జాతీయ రహదారులతో అనుసంధానమై ఉన్నది. 5వ నంబరు మరియు 16 వ నంబరు   జాతీయ రహదారులు ఈ జిల్లా గుండా ప్రయాణిస్తూ, దేశంలోని ప్రధాన నగరాలైన హౌరా మరియు చెన్నైలను అనుసంధానిస్తున్నాయి. ఈ జిల్లాలో 406  కిలో మీటర్ల రైలు మార్గం ఉంది. ఈ జిల్లా నుండి ఎందరో ప్రముఖులు వివిధ రంగాలలో సేవలందిస్తున్నారు. శ్రీ టంగుటూరి ప్రకాశం మద్రాస్ రెసిడెన్సీలోనే ముఖ్యమంత్రిగా వ్యవహరించి, ఆంద్ర ప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు.. మరెందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ జిల్లా నుండి వచ్చి, రాష్ట్రాన్నికి సేవలందించారు.

2015-16 విద్యాశాఖ వివరాలననుసరించి ఈ జిల్లాలో మొత్తం 4,311  ప్రభుత్వ, ప్రవేటు, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఇందిలో  33 రాష్ట్ర ప్రభుత్వాధీనంలో నడుస్తుండగా,  2,949 మండల మరియు జిల్లా పరిషత్ పాఠశాలలున్నాయి. ఇదికాకుండా ఒక రెసిడెఏన్షియల్ , 1079 ప్రవేటు రంగ పాఠశాలలు ,  10 మోడల్ పాఠశాలలు, , 37  కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలు, 50  మునిసిపాలిటీ, మరియు 152 ఇతర యాజమాన్యాల ఆధ్వర్యంలో పనిచేసే స్కూళ్ళు ఉన్నాయి.

రాష్ట్రంలో ఈ జిల్లా ఆర్ధికంగా అత్యంత వెనుకబడి, అనేక అభివృద్ధి పరమైన సమస్యలనెదుర్కొంటున్నది. ఇందులో మంచినీటి ఎద్దడి, తాగునీటి కొరత ప్రధానమైనవి. నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం వలన ప్రజలు అనేక కీళ్లు, దంత సంబంధిత వ్యాధులబారిన పడి, వికలాంగులై, జీవనాన్ని భారంగా గడుపుతున్నారు. భూగర్భజలాలు కలుషితమై ఉన్నాయి. జిల్లా వెనుకబాటు తనానికి ప్రభుత్వాల నిర్లక్త్శ్యఎం ప్రధాన కారణం. విద్యా పరంగా ఒక్క పేరొందిన యూనివర్సిటీ కూడా ఏ జిల్లాలో లేదు. ప్రభుత్వాలు వెంటనే స్పందించకపోతే, ఈ వెనుకబడిన జిల్లా మరింత క్రుంగి పోతుందనే విషయంలో సందేహం లేదు.

Top