ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

చీరాల నియోజకవర్గం

చరిత్ర

ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఒకటై, దక్షిణ భారతదేశం యొక్క 'చిన  ముంబాయి' గా పిలువబడే చీరాలకు పూర్వనామం కేశపురి, ఇక్కడి సముద్రం పాలు వలె తెల్లగా ఉన్నందున ప్రాంతానికి కేశపురి అనే పేరువచ్చింది.చేనేత పరిశ్రమే ప్రధాన వృత్తి అయినందువల్ల  చేతితో నేసిన ఇక్కడ వస్త్రాలు దేశమంతటా గుర్తింపుపొందాయి .ఇక్కడి జీడిపప్పు, మరియు తినుబండారాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడుతుంది. స్వాతంత్య్ర  సమరయోధంలో చీరాలకు ప్రత్యేక స్థానం ఉంది.

నియోజకవర్గంలో 190044 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు  92785మంది కాగా,స్త్రీలు 97240 మంది.

ప్రసిద్ధ ప్రదేశాలు:

వాడరేవు బీచ్ మరియు రామాపురం బీచ్ పర్యాటకులను అలరిస్తున్నాయి. ప్రతి ఏటా కార్తీక మాసంలో లక్షలాది ఓడరేవుల వద్ద పుణ్య  స్నానాలు ఆచరిస్తారు. చీరాలలో జరిగే  చేనేత దినోత్సవంకు  ప్రత్యేక గుర్తింపు ఉంది. వేటపాలెం లైబ్రరీ.

నియోజకవర్గపు ప్రముఖులు:

ప్రసిద్ధ ప్రిథ్వీ  సోలుషన్స్ అధినేత అయిన మాధవి  ఉప్పలపాటి చీరాల వాస్తవ్యులే.

పంటలు

పొగాకు, వరి, చెరకు, వేరుశెనగ, ప్రధాన పంటలు కాగా పుట్టగొడుగుల పెంపకం కూడా ఇక్కడ సాగుతుంది.

నియోజవర్గపు సమస్యలు:

  • వాడరేవు లో పోర్టు నిర్మాణం కోసం పడిగాపులు
  • తార స్థాయికి చేరిన రాజకీయ గొడవలు
  • ప్రభుత్వ ఆసుపత్రిలో లంచంపేరుతో  రోగుల పాలిట రక్తం పీల్చే  జలగల్లా మారిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది .
  • పట్టణ గృహ నిర్మాణ పధకం లభ్ది దారులకు తీరని ఋణ కష్టాలు.
  • నిత్యం  ఏదో ఒక రౌడీ గొడవలతో బెంబేలెత్తుతున ప్రజలు
  • అధ్వాన స్థితిలో ఉన్న  డ్రైనేజి  వ్యవస్థ.
Top