చుట్టూ నల్లమల్ల కొండలతో గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతమైన మార్కాపురం విజయనగర రాజులచే పాలించబడిన ప్రాంతం,ఈ ప్రాంతంలో విష్ణువు రాక్షసుడైన కేసిని హతమార్చాడు .
ఈ నియోజకవర్గంలో మొత్తం 199162మంది ఓటర్లు ఉండగా ,వీరిలో 100520 మంది పురుషులు ఉండగా, 98619 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
మార్కాపురం మట్టి పలక ప్రపంచానికి అ ఆ లు నేర్పించింది ,ఇక్కడి నుండి సింగపూరు ,జపానుతో పాటు ప్రపంచం నలుమూలలకు పలకలు తరలించేవారు. ఇక్కడ 200 పలకల గనులు 300 తయారీ ఫ్యాక్టరీలు ఉండేవి .
స్వాతంత్య సమరయోధులు మరియు శాసనసభ సభ్యులు అయిన కందుల ఓబుల్ రెడ్డి ఈ ప్రాంతం వారే.
విజయనగర శైలి లో నిర్మించబడిన చెన్నకేశవ స్వామి ఆలయంతో పాటు కొన్నిదేవాలయాలు చూడదగ్గ ప్రదేశాలు.
తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు,మరియు ఉద్యానవన పంటలు ఎక్కువ సాగులో ఉండగా పత్తి మరియు చెరుకు ప్రధాన వాణిజ్య పంటలుగా ఉన్నాయి.