ఇటు వ్యవసాయం అటు రాజకీయం రెండు రంగాలలోనూ చైతన్యం కల నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గము. ఈ నియోజకవర్గం పరిధిలో పర్చూరు,ఇంకొల్లు ,యద్దనపూడి ,మార్టూరు , కారంచేడు,చినగంజాం మండలాలు ఉన్నాయి.ఈ నియోజకవర్గంలో మొత్తం 214392మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 105213 మంది పురుషులు కాగా,109163 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నియిజక వర్గంలోని ఇంకొల్లు పూర్వనామం ఇంకిన కొలను కాలక్రమంలో అది ఇంకొల్లుగా మారింది.
ఎంతో ప్రాముఖ్యత గల అద్దంకి నాంచారమ్మ దేవాలయం చూడదగ్గ పుణ్య కేత్రం.
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరియు దగ్గుబాటి వెంకటేశ్వరరావు , దగ్గుబాటి చెంచురామయ్య , గాదె వెంకటరెడ్డి ఈ నియోజకవర్గానికి చెందిన వారే.
మిర్చి,పొగాకు,పత్తి మరియు వేరుశనగ పంటలను ఇక్కడ ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు.