కాటంరాయుడు ,విజయనగర రాజులు,వారి తర్వాత రెడ్డిరాజుల మరియు సుల్తానులచే పాలించబడి , ఎన్నో గుప్తనిధులు కలిగి ఉండి , కొండలకు సమీపంలో ఉన్నందున కనిగిరి పూర్వం కనకపట్నం అని పిలువబడేది ,కనక అనగా బంగారం మరియు గిరి అనగా కొండ అని అర్ధం. కాలక్రమంలో కనకపట్నం కాస్తా కనిగిరిగా రూపాంతరం చెందింది. ఈ నియోజకవర్గంలోని పామూరి వంటకాలకు దక్షిణ భారతదేశంలోనే ప్రతేయక గుర్తింపు ఉంది.
ఈ నియోజకవర్గంలో మొత్తం 207766 మంది ఓటర్లు ఉండగా,వీరిలో 105324 మంది పురుషులు కాగా,102427 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
కనిగిరి కోట ,బ్రహ్మంగారి ఆలయం,శ్రీకృష్ణ ఆలయం ,కనకదుర్గ ఆలయం మరియు సుల్తానుల కాలంనాటి మసీదులు మరియు కనిగిరిలో జలవనరుల శాఖ చూడదగ్గ ప్రదేశాలు.
పొగాకు, వరి, చెరకు, వేరుశెనగ ఇక్కడి ప్రధాన పంటలు.