ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

అద్దంకి నియోజకవర్గం

చరిత్ర

గుండ్లకమ్మ పరివాహకంగా ఉంటూ బౌద్ధ ,జైన సంసృతులకు నిలయంగా ఉన్నఅద్దంకి పల్లవులు,తూర్పు చాణిక్యులు , కాకతీయులు,యాదవ రాజులు  మరియు రెడ్డి రాజులు,విజయనగర రాజులచే పాలించబడిందితొలి తెలుగుపద్య శాసనానికి పుట్టిలు అయిన అద్దంకి  పూర్వనామం అడకి ,కాలక్రమంలో అది అద్దంకిగా రూపాంతరం పొందిందిఅడకి అనగా సైనిక స్థావరం అని అర్ధం,పల్లవుల కాలం నుండి విజయనగర రాజుల వరకు అద్దంకి సైనిక స్థావరంగా విరాజిల్లింది. అద్దంకిలో అద్ద మరియు అంకి అనే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమకోసం ప్రాణాలను సమర్పించుకున్నారు ,అందుకే నగరానికి అదంకి అనే పేరు వచ్చింది.ఉంగి వంశరాజైన పాండురంగ తన సైన్యాధిపతి యుద్ధవిజయలకు గుర్తుగా  బహుకరించిన భూమితో అద్దంకి ఏర్పడింది. క్రీస్తు శకం 848లో మొట్టమొదటి తెలుగు పద్య శాసనం ప్రాంత సమీపంలోని వెయ్యి స్థంబాల గుడి ఆవరణలో జరిగిన త్రవ్వకాలలో బయటపడగా, పద్య శాసనాన్ని మద్రాసు మ్యూసియంలో భద్రపరిచారు. శాసనాన్ని పండరంగడు అనే చాణుక్య సేనాని 12 బోయకొట్టాలను జయించినందుకు గుర్తుగా తెలుగులో శాసనాన్ని వేయించారు. శిలాఫలకం ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధిచిన ముఖ్యమైన అధ్యాయం. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రాచీనత కలిగిన నగరంగా అద్దంకిని చెప్పవచ్చు.

ఓటర్లు

అద్దంకి నియోజకవర్గంలో 220531 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 108749 మరియు స్త్రీలు 111769. ఓటర్లలో ఎక్కువగా కమ్మసామాజిక వర్గం వారే ఉనందున గెలుపోటములు  వారి  నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి.

నియోజకవర్గపు ప్రముఖులు:

భారతాన్ని పూరించిన ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ  వేమారెడ్డి ఆస్థానకవి. ఎర్రన ఇక్కడినుండే  మహాభారత కావ్యాన్ని పూర్తి చేసారు.

 తొలి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూగు ప్రకాశం పంతులుకు ఓనమాలు ధిదింది కూడా నగరమే కావడం విశేషం.

ప్రసిద్ధ ప్రదేశాలు:

నియోజకవర్గంలో  చెప్పుకోదగ్గ పర్యాటక ప్రదేశాలు ఏమి లేవు,ప్రసిద్ధ పుణ్యక్షేతం శింగరకొండ ఇప్పుడిపుడే  పర్యాటకంగా వృద్ధిచెందుతుంది. వెయ్యి స్థంబాల గుడి ,శింగరకొండ, మాణికేశ్వరం ,రామకూరును పర్యాటక ప్రదేశాలుగా తీర్చిద్దిధాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అద్దంకి సమీపంలోని ధర్మవరం ప్రాచీన జైన మతంలోని ఒక శాఖకు కేంద్రంగా విరాజిల్లింది.

పంటలు

అద్దంకి నియోజక వర్గంలో ప్రధానంగా వరి,శనగ ,కంది ,పత్తి ,పొగాకు,మిర్చి,మొక్కజొన్న ,జూటు ,సుబాబులు ,పశుగ్రాసం మరియు కూరగాయల పంటలు సాగవుతాయి.నాగార్జున సాగర్ ఏబీసి ఆయకట్టు కింద సుమారు 50 వేల ఎకరాలు ఉన్నాయి. నియోజకవర్గంలో యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు ఎత్రిపోతల పధకం నిర్మాణంలో ఉంది,ఇది పూర్తయితే మరో 20వేల  ఎకరాలకు సాగు నీరందుతుంది. గ్రానైట్  నిక్షేపాలతో కొంతమేర పారిశ్రామిక అభివృద్ధి.

నియోజవర్గపు సమస్యలు:

  • వర్గ రాజకీయ పోరాటాలతో అభివృద్ధికి ఆమడ దూరం .
  • తాగు మరియు సాగునీటి సమస్య
  • పూర్తికాని భవనాసి రేజర్వాయర్
  • ఇళ్లస్థలాల పంపిణి జరగలేదు
Top