ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

యర్రగొండపాలెం నియోజకవర్గం

శివ పురాణాలలో నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల ప్రస్తావన ఉంది. మొదటి నుండి వెనుకుబాటుతో,నల్లమల్ల అడవులను అనుకోని ఉన్న యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో యర్రగొండపాలెం,దోర్నాల,పుల్లలచెరువు ,త్రిపురాంతకం,పెద్దారవీడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 188593 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 95181 మంది పురుషులు కాగా ,93408 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

పంటలు

పొగాకు, వరి, చెరకు, వేరుశెనగ, ప్రధాన పంటలుగా సాగులో ఉన్నాయి.

ప్రసిద్ధ ప్రదేశాలు:

త్రిపురాంతకంలోనిత్రిపురనాగ బాల త్రిపురసుందరి దేవి (స్వయంభు)ఆలయం ,పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరుడి ఆలయం ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు , ఆలయ ప్రాంగణంలో  శ్రీశైలంకు రహస్య భూగర్భ మార్గం ఉందని వినికిడి. మరియు దోర్నాల ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.

నియోజవర్గపు సమస్యలు:

  • తాగు మరియు సాగు నీటి కోసం యాతన పడుతున్న నియోజకవర్గ ప్రజలు. వేసవిలో   గుక్క నీటికోసం అష్టకష్టాలు పడుతున్న ప్రజలు.
  • సరైన ,రహదారులు లేక ,బిందె నీటి కోసం కిలోమీటర్ల మేర నడుస్తున్నగిరిజన  ప్రజలు.
  • ఎండిపోతున్న పండ్ల తోటలు. ఆధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ.
  • పూర్తికాని వెలుగొండ ప్రాజెక్ట్
  • పూర్తి వెనుకుబాటు కారణంగా ఉపాధి అవకాశాల లేమితో పెరుగుతున్న వలసలు.  
Top