ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

క్రిష్ణా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా పేరుపొందిన కృష్ణా జిల్లాకు మచిలీపట్నం జిల్లా ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తున్నది. మచిలీపట్నం పరిపాలనా కేంద్రంగా ఉంటె, జిల్లాలో అత్యంత ఎక్కువ జనసమ్మర్దం గల పట్నంగా పేరొందిన విజయవాడ వ్యాపార, సాంస్కృతిక కేంద్రంగా వ్యవహరిస్తున్నది.  

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 45,29,009  మంది ప్రజలు నివసిస్తుండగా, వీరిలో మగవారి సంఖ్య  2,267,375, మహిళల సంఖ్య d 2,250,023. 73.74% అక్షరాస్యతతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే విద్యారంగంలో అగ్రగామిగా పేరొందింది.

 పశ్చమ గోదావరి, గుంటూరు, సూర్యాపేట, బంగాళఖాతంలు  ఎల్లలుగా సముద్ర తీరంప్రాంతంలో విస్తరించి ఉన్న కృష్ణా జిల్లా 1859లో రాజమండ్రి జిల్లానుండి వేరుపడింది. 1904లో కృష్ణా జిల్లా నుండి గుంటూరు జిల్లా ఏర్పడగా, 1925లో పశిమ  గోదావరి జిల్లా ఏర్పడింది.శాతవాహనులు, పల్లవులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, ముస్లింలు నాయక, రెడ్డి  వంశస్తులు, గజపతులు  పాలించిన ప్రాంతానికి క్రీస్తుపూర్వం 2 శతాబ్దం నుండే అతి ప్రాచీన చరిత్ర ఉంది.

50 మండలాలున్న కృష్ణా  జిల్లాలో 5 రెవిన్యూ మండలాలు, 49 మండల పరిషత్తులు, 973 పంచాయతీలు, 1005 గ్రామాలు , 20 పట్టణాలు, మరియు 5 మున్సిపాలిటీలున్నాయి. జిల్లాలో విజయవాడ ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించింది. 2015-16 సంవత్సరంలో 62,726 కోట్ల వార్షిక ఆదాయంతో, కృష్ణా జిల్లా 12% స్థూల రాష్ట్రీయ   ఉత్పత్తిని సాధించింది.

2015–16విద్యా సంవత్సరంలో, జిల్లాలో మొత్తం 4,449 పాఠశాలలుండగా, వీటిలో15 ప్రభుత్వ పాఠశాలలు, 2,432 మండల మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు, 3 రెసిడెన్షియల్ స్కూళ్ళు, 1748 ప్రవేట్ పాఠశాలలు, , 2 మోడల్ స్కూళ్ళు, , 3 కస్తూర్భా బాలికా విద్యాలయాలు  180 మునిసిపల్ మరియు  66 ఇతర పాఠశాలలున్నాయి. ఇవే కాకుండా జిల్లాలో అనేక ప్రభుత్వ, ప్రవేటు ఇంజినీరింగ్ కళాశాలలు, ఆంధ్ర లయోలా, స్టెల్లా మేరీస్  డిగ్రీ  కళాశాలలు,ఎన్టీఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, వంటి ప్రముఖ సంస్థలు విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు దేశ, విదేశాల నుండి యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ కనకడుగమ్మవారి దేవాలయం. మంగినపూడిలోగల బీచ్, ఉండవల్లి గుహలు,  ,కొల్లేరు లో దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు, పక్షుల సంరక్షణ కేంద్రం వంటివి జిల్లాలో గల ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు.

Top