ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

గన్నవరం నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో గన్నవరం శాసనసభ నియోజకవర్గం ఒకటి. గన్నవరం నియోజకవర్గం 1955 లో ఏర్పడింది.

నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 230634 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 113551 కాగా ఆడవారి సంఖ్య 117055.

 గన్నవరం, ఉంగుటూరు మండలాలు పూర్తిగా, కంకిపాడు మండలంలోని రెండు, బాపులపాడు మండలంలోని తొమ్మిది గ్రామాలు, ఉయ్యూరు మండలంలోని రెండు గ్రామాలు కలిపి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.

పునర్విభజన తదుపరి గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పరిధిలోని గ్రామాలు పూర్తిగా, విజయవాడ రూరల్మండలంలోని తొమ్మిది గ్రామాలతో నియోజకవర్గాన్ని పునర్విభజించారు. తూర్పున ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడు, పడమరన విజయవాడ రూరల్మండలంలోని పి.నైనవరం, దక్షిణాన రామవరప్పాడు, ఉత్తరాన బొమ్ములూరు గ్రామాలు నియోజకవర్గంలో ఉన్నాయి.

ముఖ్యమైన ప్రదేశాలు

విమానాశ్రయం, ఐటీపార్కు . సూరంపల్లి పారిశ్రామిక వాడ, పశుదాణా కర్మాగారం, డెల్టా షుగర్స్‌, పట్టుగూళ్ల పరిశ్రమ, శ్రీనివాస హేచరీస్వంటివి ఉన్నాయి. పెద అవుటుపల్లిలో జోసెఫ్తంబి పుణ్యక్షేత్రం, చిక్కవరం గ్రామములో బ్రహ్మయ్య లింగం ఆలయం, హనుమాన్ జంక్షన్లో అభయాంజనేయస్వామి దేవాలయం ఉన్నాయి.

ప్రముఖులు

నియోజకవర్గం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖుల పేర్లు ఉన్నాయి. కవి విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జైరమేష్‌, తమిళనాడు మాజీ గవర్నర్పీఎస్‌.రామ్మోహనరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి రామ్మోహనరావు, గద్దె రామ్మోహనరావు, తానా అధ్యక్షుడు టీబీఆర్ప్రసాద్‌, కేవీపీ రామచంద్రరావు వంటి వారు ఎందరో ఉన్నారు.+

నియోజవర్గపు సమస్యలు:

  • నియోజకవర్గ ప్రజలలో సామాజిక ఆర్థిక పరిస్థితుల జీవనశైలిలో ఇక్కడ నిరుపేదలు, దళిత, వ్యవసాయ కార్మికులు ఎక్కువ.
  • ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, పెద్ద పథకాలు అయిన ఐటీ పార్కు, విమానాశ్రయ అభివృద్ధి, పోలవరం తవ్వకం వంటివి ఉన్నాయి.
  • తాగు నీటి సమస్య నీయోజకవర్గంలో ఉంది.
Top