ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మచిలీపట్నం నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 182361 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 89563 కాగా ఆడవారి సంఖ్య 92786.

దీనిని బందరు లేదా మసూలిపటం లేదా మసూల అని కూడా పిలుస్తారు. ఈ పట్టణానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రత్యేక పురపాలక సంఘ స్థాయి కల్పించబడింది. ఈ పట్టణం చరిత్ర 3 వ శతాబ్దం శాతవాహనుల కాలములో నుండి ఉన్నదని దానిని మైసలోస్ (టోలిమి) మసిలా (పెరిప్లస్) అని పిలిచేవారని తెలుస్తున్నది.

తీరపట్టణం అవడం చేత 17 వ శతాబ్దములో బ్రిటీష్ వారు, ఫ్రెంచ్ వారు డచ్ వారు ఇక్కడ నుండి వర్తకం జరిపేవారు. 350 పడవలు పట్టే సన్నకారు చేపల రేవు ఉంది. ఈ పట్టణం కలంకారీ అద్దకం పనికి (కూరగాయల నుండి తీసిన రంగుల), తివాచీలకు, బందరు లడ్డు లకి ప్రసిద్ధి.

చరిత్ర

బందరుకి మచిలీపట్నం అన్న పేరు రావటానికి వెనుక కథ ఒకటి ఉంది. సముద్రపుటొడ్డున ఉన్న కోట ద్వారం దగ్గర ఒక చేప విగ్రహం ఉండేది. అందుకని ఈ ఊరికి మచిలీపట్నం అన్న పేరొచ్చిందంటారు. 'మచిలీ' అంటే హిందీ భాషలో చేప, పట్నం అంటే పెద్ద ఊరు. తెలుగు దేశంలో పట్టణం అనేది సర్వసాధారణంగా సముద్రపు ఒడ్డున ఉన్న రేవులకే వాడతారు. ఉదాహరణకు చెన్నపట్నం, విశాఖపట్టణం, భీమునిపట్నం, కళింగపట్నం, నిజాంపట్నం మొదలైనవి. పట్నంతో ముగిసే పేర్లు కల ఊళ్ళు అన్ని తూర్పుకోస్తాలో ఉన్నాయి.

1659 లో బ్రిటిషు వారు ఫ్రెంచివారిని మసూలిపటం ముట్టడిలో ఓడించి, వారి స్థావరాన్ని ఆక్రమించారు.

1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీవారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం కూడా ఒకటిగా ఉండేది.  ఈ పట్టణానికి మచిలీపట్నం, అనీ బందరు అనీ మాత్రమే కాక పూర్వం మచిలీ బందరనే పేరు కూడా వ్యవహారంలో ఉండేది.

దర్శనీయ ప్రదేశములు

మంగినపూడి బీచ్

ఈ బీచ్ మచిలీపట్నానికి 11 కి.మీ. దూరంలో ఉంది. బెస్తవారు ఉండే చిన్న గ్రామమిది. ఇక్కడి బీచ్ లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది. విదేశీయులకు తూర్పు తీరానికి చేరడానికి ఇది ముఖ ద్వారముగా ఉండేది. ఇక్కడి బీచ్ లో సముద్రము లోతు తక్కువగా ఉంటుంది. ఈ బీచ్ లో ఉన్న నాట్య పాఠశాలలో నృత్య విద్యార్థులకు కూచిపూడి నృత్యము నేర్పిస్తున్నారు. ఇక్కడ తీరములో ఉన్న దత్తాశ్రమము ఒక పుణ్యక్షేత్రము మరియు తీర్థ స్థలము. దీనిని దత్తరామేశ్వరము అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న శివాలయం చాలా పురాతనమైనది. రామేశ్వరములో ఉన్నట్లుగా ఇక్కడ మంగినపూడిలో పన్నెండు బావులు లింగాకారంలో ఉంటాయి. అంతే కాదు ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క రుచిలో ఉంటాయంటారు.  అందువలన దీనిని దత్తరామేశ్వరము అని పిలుస్తారు. కార్తీక పౌర్ణమికి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్నానము చేస్తారు.

శ్రీ పాండురంగస్వామి దేవాలయము:-

 మచిలీపట్నానికి దగ్గరలో ఉన్న చిలకలపూడి లో ఈ పాండురంగస్వామి దేవాలయం ఉంది. ఇది మంగినపూడి బీచ్కి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడి దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు. పండరీపురములో ఉన్న దేవాలయము వలే ఇక్కడ దేవాలయము ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం చాలా విశాలంగా ఉంటుంది. అంతరాలయములోనున్న పాండురంగడి నల్లరాతి విగ్రహం మరియు గర్భగుడి బయటవున్న పాలరాతి అమ్మవార్ల విగ్రహలు చూపరులను భక్తిభావముతో కట్టిపడెస్తాయి. భక్తులు పాండురంగడిని అరాధించి, పటికబెల్లం నైవేద్యముగా సమర్పిస్తారు.

రవాణా సౌకర్యాలు

మచిలీపట్టణం నుంచి విశాఖపట్టణం, బీదర్, ధర్మవరం,విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు ప్రతి రోజూ రైళ్ళు మరియు బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

ఈ నియోజవర్గపు సమస్యలు:

  • తాగు నీటి సమస్య
  • మంగినపూడి బీచ్ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి.
  • విజయవాడ నుంచి బండారు కు నిర్మాణంలో ఉన్న 4 లైన్ల రోడ్డు పూర్తయితే రాకపోకలు సులభమవుతాయి.
  • నియోజకవర్గంలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. 
  • ఆధునీకరించని రహదారులు
  • పోర్ట్  నిర్మాణానికి అనుమతులు వచ్చినా పనులు మాత్రం ఇంకా దాల్చలేదు.
Top