ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

నూజివీడు నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో నూజివీడు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 214700 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 107769 కాగా ఆడవారి సంఖ్య 106920.

నూజివీడు చరిత్ర

పూర్వం రాజుల పరిపాలనలో ఈ పట్టణం ఉండేది. నూజివీడు రాజుల కోట నుండి విజయనగర ఆస్థానం వరకు ఒక సొరంగం ఉండేది.అది ప్రస్తుతం కరెంటు ఆఫీసుగా ఉన్న రాజుల కోటకు ఆగ్నేయంగా ఉండేది.ఈ కోట కోడిగుడ్డు సొన మరియు మినుప పిండి సున్నం వేసి నిర్మించారు. తరువాత ఆ కోటలో ఆ.ప్ర సాంఘిక సంక్షేమ పాఠశాల బాయ్స్ ని గోవర్నమెంట్ ఉంచింది.

నూజివీడు పట్టణ విశేషాలు

నూజివీడు మామిడిపండ్లకే కాదు, వీణల తయారీకి కూడా  ప్రసిద్ధి. పట్టణంలోని వెంకటేశ్వర కోవెల ప్రాంతములో వీణల తయరీ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ తయారుచేసిన వీణలకు, దేశంలోనే కాదు విదేశాలలో గూడా ప్రాచుర్యం ఉన్నది. రాజులకాలంలో ప్రారంభించిన వీణల తయారీదారులు ఇప్పటికీ తమ వృత్తిని కొనసాగించుచున్నారు.

ఇందులో ప్రావీణ్యం సాధించిన షేక్ మాబు కు, 2017,మే-23న, దత్తపీఠ విద్వాన్ పురస్కారం లభించడం విశేషం.

2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన పోటీలలో వీరు తయారు చేసిన మయూర వీణకు ప్రథనస్థానం లభించినది.

సరస్వతి, మయూర, విపంచి, డ్రాగన్, ఫోల్డింగ్, గోటు, మధుర వీణల తయారీలో వీరు నిష్ణాతులు. ఈ తండ్రీకొడుకులు రూపొందిన వీణలను ప్రముఖ వీణ చిట్టిబాబు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి, ద్వారం భవన్నారాయణ, డాక్టర్ పినాకపాణి, శ్యాంసుందర్ వంటి ఎందరో విద్వాంసులు తమ కచేరీలకు కొనుగోలు చేసేవారు.

నూజివీడు పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు

శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరస్వామివారి ఆలయం:- నూజివీడు పట్టణంలోని గొడుగువారిగూడెంలో నెలకొన్న ఈ ఆలయం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం.

శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి ఆలయం, (శివాలయం):- నుజివీడు పట్టణంలో బస్సుస్టాండ్ రహదారిలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక ఎం.ఆర్.అప్పారావు కాలనీలో వేంచేసియున్న ఈ ఆలయం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం.

నియోజకవర్గంలోని మండలాలు

  • అగిరిపల్లి
  • చాట్రాయి
  • ముసునూరు
  • నూజివీడు

ఈ నియోజవర్గపు సమస్యలు:

  • తాగు నీటి సమస్య ఈ నూజివీడు నియోజకవర్గంలో ఉంది.
  • తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.
  • ఆధునీకరించని రహదారులు
  • డ్రైనేజి వ్యవస్థ బాగులేక, ప్రాంతమంతా మురుగు కంపుతో నిండిపోయింది
  • నియోజకవర్గంలో సరైన విద్య, వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.
Top