ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పెనమలూరు నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో పెనమలూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 233679 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 115408 కాగా ఆడవారి సంఖ్య 118256.

చరిత్ర

గ్రామంలోని  పినమల్లేశ్వరుడు ద్వారా ఈ ఉరికి ఈ పేరు వచ్చింది, మరియు గతంలో మథబ్ కా పెనమలూరు అని పిలిచేవారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు పెనపాలురులో ఉన్నాయి.

షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- పెనమలూరులోని ఈ ఆలయం ప్రసిద్ధి చెందిన పునక్షేత్రం.

శ్రీ గంగానమ్మ ఆలయం:-  గోగులమ్మ చెరువు ప్రక్కనే కల ఈ పురాతన ఆలయం పెనమలూరులో ప్రసిద్ధి చెందింది.

ప్రముఖులు

ప్రముఖ రచయిత, టీవీ నటుడు పరిటాల ఓంకార్ ఈ నియోజకవర్గానికి చెందినవాడే.

ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కూడా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు.

మండవ రిషిత :- పెనమలూరు గ్రామానికి చెందిన మండవ రిషిత విలువిద్యలో సవ్యసాచి. గురిచూసి బాణం వదిలితే లక్ష్యాన్ని ఛేదించినట్లే. విల్లు ఎక్కుపెడితే, పతకం ఆమె చేతిలో పడినట్లే. ఈమె ఇంతింతై వటుడింతైనట్లుగా పెనమలూరు నుండి అంతర్జాతీయస్థాయిలో ఆర్చరీలో విజయపరంపర కొనసాగించుచున్నది. ఈమె విలువిద్యలోనేగాక అటు ఉన్నత విద్యలోగూడా రాణించి, ఎం.బి.బి.ఎస్. పూర్తిచేసింది.

నియోజకవర్గంలోని మండలాలు

  • కంకిపాడు
  • పెనమలూరు
  • విజయవాడ గ్రామీణ మండలంలోని కొన్ని గ్రామాలు

ఈ నియోజవర్గపు సమస్యలు:

  • ఈ నియోజకవర్గంలో చాల ప్రాంతాలలో ప్రభుత్వం స్వంత ఇళ్లను నిర్మించాల్సి ఉంది.
  • పట్టణంలో డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉంది. అస్తవ్వస్తమైన రోడ్ల వల్ల ట్రాఫిక్ సమస్యలేర్పడుతున్నాయి. మౌలిక వసతులు కల్పించాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.
  • ఈ నియోజకవర్గంలో చాల ప్రాంతాలలో త్రాగు నీటి సమస్వలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
  • ఈ నియోజకవర్గంలో విద్య వైద్య సదుపాయాలను మెరుగుపర్చాల్సి ఉంది.
Top