ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 2,36,912 గా నమోదయింది.

విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం పరిధి లి 20 డివిజన్లు ఉన్నాయి.

నియోజకవర్గంలోని మండలాలు

  • విజయవాడ పట్టణ మండలంలోని కొన్ని గ్రామాలు
  • విజయవాడ కార్పోరేషన్‌లోని కొన్ని వార్డులు

స్థల నామకరణం

విజయవాడకు ఆ పేరు రావటం వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ఇలా సాగుతుంది: పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు, వారిని వేదవ్యాసుడు కలిసి, వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఆ పనికి ఆర్జునుడిని ఎన్నుకొంటారు.

అర్జునుడు ఇంద్రకీల పర్వతముపై (ఇంద్రకీలాద్రి) ఒంటికాలిపై, చేతులు పైకెత్తి, పంచాగ్నుల మధ్య (నాలుగు సృష్టించినవి ఐదవది సాక్షాత్తూ సూర్య భగవానుడు), ఘోరమయిన తపస్సు చేసాడు. శివుడు, అర్జునుడి భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు. ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడయిన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుగుబంటిపైకి బాణము విసురుతాడు. అదే సమయములో వేటగాని రూపములో ఉన్న శివుడు కూడా బాణము విసిరుతాడు. ఈ రెండు బాణములు ఒకేసారి తగిలి, ఎలుగుబంటి మరణిస్తుంది. ఇద్దరూ ఆ ఎలుగును చంపింది తానంటే తానేనని తగువుకి దిగుతారు. మాటలు కాస్తా యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎంత గొప్పవీరుడయినా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా ఆలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగము మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుండటం గమనించి, సాక్షాత్తూ శివుడే ఆ వేటగాడని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై, అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి. రాళ్ళ కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచారు.

దర్శనీయ ప్రదేశములు

వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం - లబ్బీపేట

వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం  విజయవాడలో పేరుగాంచిన దేవాలయము. ఇందిరా గాంధీ స్టేడియం దగ్గరగా ఉంది. బెంజి సర్కిల్ నుండి రెండు కిలోమీటర్ల దూరములో ఉంది.

రామలింగేశ్వర స్వామి దేవాలయం - యనమలకుదురు

స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న పర్వతం పైన ఉంది. బెంజి సర్కిల్ నుండి మూడు కిలోమీటర్ల దూరములో ఉందీ విజయవాడలో పేరుగాంచిన దేవాలయము.శీవిరాత్రి పర్వదినాన ఘనంగా స్వామి వారి ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజు జరిగే ఉత్సవాలలో ప్రభలు చుడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే గాక రాష్ర్టం నలుమూలల నుంచి జనం వస్తారు.

ఈ నియోజవర్గపు సమస్యలు:

  • కొండా ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఏళ్ళ తరబడి పెండింగులో ఉంది.
  • నియోజకవర్గ పరిధి లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
  • గండికొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిస్తే ఇక్కడి  పరాజయాలకు ఉపాధి కలుగుతుంది.
  • డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక వర్షం పడినప్పుడు డ్రైనేజీ రోడ్ల మీద పొంగిపొర్లుతోంది.  చెత్త డంపింగ్ సమస్యలు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది.
  • త్రాగు నీటి సమస్యలతో ఈ ప్రాంతపు ప్రజలు సతమతమవుతున్నారు.
  • ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగుపర్చాలని ఈ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.
Top