ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పాణ్యం నియోజకవర్గం

పాణ్యం - ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు నంద్యాల లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పాణ్యం జనాభా సుమారు 2,80,641 మంది.

అభివృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్న నియోజకవర్గం కర్నూలు జిల్లా పాణ్యం. 35 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఇక్కడ అందుబాటులో ఉంది జాతీయ రహదారి కనెక్టివిటీ నీటి వనరులు ఉన్నాయి, పక్కనే కర్నూలు పట్టణం కూడా ఉంది అయినా అభివృద్ధి అన్న మాట లేదు. కర్నూలు మునిసిపల్ కార్పొరేషలో భాగమైన కల్లూరు తో పాటు, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాలు సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. ఎంతో మంది ప్రముఖులు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన అభివృద్ధి అవకాశాలతో పొంతన లేకుండా పాణ్యం నియోజకవర్గంలో సమస్యలు పేరుకుపోయాయి. కల్లూరు మండలంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది సంపాదించే దాంట్లో నీళ్లకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రజలు, సంవత్సరంలో కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు నీటి కోసం పాట్లు తప్పటం లేదంటున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికలప్పుడు చెప్పిన ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు.

ఓర్వకల్లు మండలంలోని వెంకటాపురం, తిప్పాయపల్లె, చెన్నంచెట్టి పల్లెలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పాణ్యం, గడివేముల మండలాలలో రోడ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. గోరుకల్లు రిజర్వాయర్ లీకేజీతో ఊరు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇళ్లలో కూడా నీటి ఊటలు వస్తున్నాయి, ఇలాంటి ఊటలు వల్ల కొన్ని ఇల్లు ఇప్పటికే కూలిపోయాయి సమస్యనైనా పరిష్కరించండి లేదా పునరావాస మైన కల్పించమని గోరుకల్లు వాసులు వేడుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న స్థానిక అధికార ప్రతినిధికి గాని ప్రభుత్వం వారికి గాని పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాలలో 35 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందున ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకోసం శంకుస్థాపన కూడా చేశారు, మూడు వేల ఎకరాలలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేశారు అలాగే ఉర్దూ యూనివర్సిటీ కి శంకుస్థాపన జరిగింది రక్షణ పరిశోధన సంస్థలకు స్థలం ఇక్కడే కేటాయించారు కానీ నాలుగేళ్ల తర్వాత కూడా ప్రాజెక్టులో పురోగతి లేకపోవడంతో ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి పరిశ్రమలకు అవసరమైన నీటి సదుపాయం కల్పించి ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. గడివేముల మండలంలో వెలగ మాన్ డ్యామ్ ఏర్పాటు చేసినట్లయితే దాదాపుగా రెండు మండలాలు సస్యశ్యామలం అవుతాయి దీనికోసం అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్న ప్రయోజనం కలగడం లేదు. మొత్తం మీద అధికార ప్రతిపక్షాల పొలిటికల్ గేమ్ లో పాణ్యం అభివృద్ధి కుంటుపడుతుంది.

Top