ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ఆళ్లగడ్డ నియోజకవర్గం

ఆళ్లగడ్డ - ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు నంద్యాల లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం 2,91,510 జనాభాలో 100% గ్రామీణ మరియు 0% పట్టణ జనాభా.

ఆళ్లగడ్డ ఒకప్పుడు పేరు వింటే టక్కున గుర్తుకొచ్చేది బాంబులే, చిన్నపిల్లలు టపాకాయలు కాల్చినంత తేలికగా ఇక్కడ బాంబులు విసురుకునేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి మారిపోయిన అప్పుడప్పుడు ఫ్యాక్షన్ హత్యలు జరుగుతున్నాయి. ఆళ్లగడ్డలో ఆధిపత్య పోరు చాలా ఎక్కువగా ఉంటుంది. అద్భుతమైన శిల్పకళా సంపద ప్రాంతం సొంతం. ఉలితో సిలకు ప్రాణం పోసే ఎంతో మంది కళాకారులు నియోజవర్గంలో ఉన్నారు. దేశం

నలుమూలలకు ఇక్కడి నుండి శిల్పాలు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గం 1962లో ఏర్పడింది.

నియోజకవర్గంలోని  గ్రామలలో రహదారులు గోరంగా ఉన్నాయి. మేజర్ పంచాయతీ నుండి మునిసిపాలిటీ అయినా సౌకర్యాలు స్థాయిలో లేవు. డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. దోమల బెడద పెరిగిపోతున్న దండయాత్రల పేరుతో హంగామా తప్ప వాటి నిర్మూలనకు పరిష్కారం చూపించడంలేదు అంటున్నారు స్థానికులు. వర్షాలు వస్తే డ్రైనేజీలు పొంగి మనుషులు తిరగడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో ఉంటుంది. వేసవికాలం వచ్చిందంటే నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లు లేక అవస్థలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా స్థానికులు నీళ్లను ట్యాంకుల ద్వారా కొనుగోలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మరియు ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది వర్షం పడిందంటే కాలు పెట్టడానికి కూడా వీలు లేని పరిస్థితిలో ఉంది.

ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అన్నది చాలా ఇబ్బందిగా మారింది ఇక్కడ సిబ్బంది, పరికరాల కొరత ఎక్కువగా ఉంది. శిల్పకళను ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు అన్న అసంతృప్తి ఎక్కువగా ఉంది. అంతంతమాత్రంగా ఉన్న వ్యాపారాన్ని జీఎస్టీ దెబ్బ కొట్టింది అన్న బాధ ఎక్కువగా ఉంది, జీఎస్టీ నుంచి ఎగ్జామ్సన్ ఇప్పించి కళను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. 2004లో చాగలమర్రిలో 70 ఎకరాల స్థలమును పేదలకు పంపిణీ చేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు స్థలము పేదలకు అందలేదు దీని గురించి ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో సాగునీటి బెడద పెద్దగా లేదు. ఇక్కడ వేరుశనగ బాగా పండుతుంది కానీ గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు దళారులు ఎక్కువ లాభపడుతున్నారు. ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తే రైతులకు ఎంతోకొంత మేలు చేకూరుతుందని ఆశిస్తున్నారు.

Top