ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కోడుమూరు నియోజకవర్గం

కోడుమూరు - ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కోడుమూరు జనాభా సుమారు 2,03,951 మంది  ఉన్నారు.

కోడుమూరు నియోజకవర్గం 1962 లో ఏర్పడింది నియోజకవర్గానికి చరిత్ర చాలానే ఉంది. మాజీ సీఎం దామోదరం సంజీవయ్య ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సొంత గ్రామం లద్దగిరి కూడా నియోజకవర్గ పరిధిలోనే ఉంది. నియోజకవర్గంలో నీళ్ల కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. గొంతు తడవాలంటే నడి ఎండలో సైతం పిల్ల, పాప బిందెలు పట్టుకొని బయటకు వెళ్లాల్సిందే, కోడుమూరు పట్టణం లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది నీళ్ల కోసం ప్రజలు మండుటెండల్లో ఆందోళన చేస్తున్నారు గుక్కెడు నీళ్ల కోసం అధికారుల్ని బతిమాలుకుంటున్నారు అయినా ప్రభుత్వంలో చలనం లేదు. స్థానిక ప్రజాప్రతినిది కలుగజేసుకొని కనీస నీళ్ల అవసరం తిరుదామన్న ఆలోచన చేయడం లేదు.

తుంగభద్ర ఎల్లెల్సీ కింద నియోజకవర్గంలో 36 వేల ఎకరాలు ఉన్నాయి ఆయకట్టు చివరి కావడంతో కనీసం 500 ఎకరాలకు కూడా నీరు అందటం లేదు. పొలాలకు నీరు అందిస్తామని ప్రతి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం మరిచిపోవటం నాయకులకి అలవాటైపోయింది. కులకుర్తి ఎత్తిపోతల పథకం ఇంకా పెండింగ్లోనే ఉంది. గుండ్రేవుల రిజర్వాయర్ కడితే తాగు, సాగు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఇంకా సర్వేలతోనే సమయం వృధా చేస్తున్నారు. అధికార పార్టీ నేతల మధ్య విభేదాలతో నియోజకవర్గ అభివృద్ధి జరగడం లేదు అధికారంలో ఉన్న నేతలే ఒకరి పనిని ఒకరు అడ్డుకుంటే ఇక ఎలా ముందుకు వెళ్ళటం అన్నది సగటు జనాల ప్రశ్న!

Top