ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మంత్రాలయం నియోజకవర్గం

మంత్రాలయం - ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మంత్రాలయం జనాభా సుమారు 1,79,686 మంది  ఉన్నారు.

పవిత్ర పుణ్యక్షేత్రం గురు రాఘవేంద్రుడు కొలువైన దివ్యధామం తుంగభద్ర వద్దనే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతుంది మంత్రాలయం. పేరుతోనే 2009 పునర్విభజనలో ఏర్పడింది అసెంబ్లీ నియోజకవర్గం. మంత్రాలయం, కోసిగి, పెద్ద కడుగోరు, కౌతాళం మండలాలు సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. తుంగభద్ర నది ఒడ్డునే ఉన్న ఎప్పుడు నియోజకవర్గంలో తాగునీటికి కటకటే. పెద్ద కడుగోరు మండలంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. దానికి ఇంత వరకు పరిష్కారం లేదు. ప్రధాన రహదారులు పర్వాలేదు అనిపిస్తున్నా గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్డు అధ్వానంగా ఉన్నాయి. మంత్రాలయం రాఘవేంద్ర కాలనీ లోనే సరిగ్గా లేవు కోసిగి, పెద్ద కడుగోరు, కౌతాళం మండలాలలోనూ ఇదే పరిస్థితి.

సరిహద్దులో ఉండటం పాలకులు అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇక్కడ అభివృద్ధి పూర్తిగా వెనకబడిపోయింది. వర్షాలు పడితే కనీసం రోడ్డుమీద అడుగుపెట్టే పరిస్థితి ఉండదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు అలాగే డ్రైనేజీ సమస్య దోమల సమస్య తో ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ప్రజలు నీటి సమస్యతో కూడా ఇబ్బంది పెడుతున్నారు వారానికి రెండు మూడు రోజులు మినహా నీరు వదలడం లేదు, విద్యుత్ తీగలు తెగిపడుతున్న అధికారులు స్పందించటం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

ఇన్ డోర్ స్టేడియం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది, జూనియర్ కాలేజ్ తరగతులు ఇరుకు గదిలోనే సాగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో తుంగభద్ర ఇసుక పుష్కలంగా ఉంది ఇదే కొంతమందికి కాసులు వర్షం కురిపిస్తుంది అధికార ప్రతిపక్షాలు పోటీపడి మరీ అక్రమ తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు పేరుకు ప్రభుత్వం ఉచితం అని ప్రకటించిన స్థానికులకు ఎక్కడ ఫ్రీగా ఇసుక దొరకదు. దందాలు చేస్తున్న ముఠాలు కర్ణాటకకు ఇసుకను తరలిస్తున్నారు కానీ పోలీసులు రెవిన్యూ అధికారులు విషయం తెలియనట్టే ఉంటున్నారు. ఇక్కడ సాగునీటికి ఎప్పుడూ కరవే గురు రాఘవేంద్ర ప్రాజెక్టుతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతలలు ఏవి పూర్తి కాకపోవటంతో రైతుల సమస్యలు తీరటం లేదు బసల దొడ్డి లిఫ్ట్ స్కీమ్ పూర్తయిన నీటితో నింపిక పోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. ఇంకో 30 కోట్ల దాకా ఖర్చు చేస్తే తప్ప పులికనుమ ప్రాజెక్ట్ పూర్తి కాదు.

Top