ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

నంద్యాల నియోజకవర్గం

నంద్యాల - ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు నంద్యాల లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. నంద్యాల జనాభా సుమారు 2,42,742 మంది.

నంద్యాల నియోజకవర్గం 1952 లో ఏర్పడింది. నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల తో పాటు గోస్పాడు మండలాలు ఉన్నాయి. పేదలకు ఇళ్లు, తాగునీటి సమస్య, రోడ్ల విస్తరణ ఇక్కడ ప్రధాన సమస్యలు. కర్నూలు జిల్లాలో పెద్ద పట్టణం, నంద్యాలను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి పెరుగుతున్న జనాభాకు తోడు రహదారుల ఆక్రమణ, తాగునీటి సమస్య పేదలకు ఆవాసం లేకపోవటం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.

నంద్యాల నియోజకవర్గం గాంధీచౌక్లో మరియు కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇది ఇవ్వాల్టి సమస్య కాదు గత 20, 25 సంవత్సరాలుగా రోడ్లు బాగా ఇరుకు అయిపోయి స్థానికంగా ఉండే చిన్నపాటి వ్యాపారస్తులు వారి బండ్లను రోడ్లమీద నిలుపుకోవటం చుట్టుపక్కల ఎక్కడ కూడా వేరే మార్గాలు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది, ట్రాఫిక్ సమస్య మూలంగా స్కూల్ కి హాస్పిటల్ కి వెళ్లాలన్న చాలా సమయం పడుతుంది. ట్రాఫిక్ లో ఇరుక్కొని చనిపోయిన వారు ఉన్నారని స్థానికులు చెప్తున్నారు, సమస్యను పరిష్కరించాలని స్థానికులు వేడుకుంటున్నారు.

నంద్యాల నియోజకవర్గంలో చాలా కాలనీల్లో మురుగునీరు చెరువులను తలపిస్తున్నాయి. మురుగునీటి దుర్వాసనను సహించలేక నరకయాతన అనుభవిస్తున్నారు, మురుగునీటితో దోమలు వ్యాప్తి చెంది తాము రోగాల పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. డ్రైనేజీ పనులు ప్రారంభించినప్పటికీ అవి ఇంకా పూర్తి కాకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుంది, తొందరగా సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Top