డోన్ - ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు నంద్యాల లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. డోన్ జనాభా సుమారు 2,27,741 మంది ఉన్నారు.
డోన్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. రాజకీయ దురందురులను రాష్ట్రానికి అందించింది కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గం. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించారు. 1962లో ఇదే నియోజకవర్గం నుండి నీలం సంజీవరెడ్డి గెలుపొందారు. 1994లో ముఖ్యమంత్రి అయినాక కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇదే నియోజవర్గం నుండి గెలుపొందారు. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాలు ఈ నియోజవర్గంలో ఉన్నాయి.
ఈ నియోజకవర్గంలో 365 రోజులు నీటి కోసం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు . గాజులదిన్నె రిజర్వాయర్ నుండి కొంతమేర నీరు సరఫరా అవుతున్న అవి ఏమాత్రం సరిపోవడం లేదు మూడు మండలాల పరిధిలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. అధికారులు నీటి సమస్య తీరుస్తారని ప్రజలు ఆశతో గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. డోన్ పట్టణంలో పారిశుద్ధ్యం, పందుల గురించి చెప్పే పనే లేదు సరైన డ్రైనేజీ సదుపాయం లేక మురుగునీరు ఎక్కడపడితే అక్కడ నిల్వ ఉంటుంది. ఈ పట్టణంలో పందులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడి ప్రజలను చూస్తే జనావాసం లో ఉన్నారా లేదా డంప్ యార్డ్ లో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. అంతేకాకుండా పందులు రోడ్డు మీదే పరుగులు తీస్తూ ఉంటాయి దాని కారణంగా రోడ్డు మీద వెళ్లే ప్రజలకు అంతరాయము కాకుండా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా వీటి ద్వారా ప్రజలకు మరియు చిన్న పిల్లలకు అనారోగ్యం కలుగుతుంది. వీటిని నియంత్రించమని ప్రభుత్వానికి ఎంత విన్నవించుకున్నా ప్రయోజనం లేదు అని ప్రజలు బాధపడుతుంటారు. నంద్యాల గేటు కర్నూలు గేటు చాలా ఇబ్బందికర సమస్యలుగా ఏర్పడినాయి వాటి వలన వాహనాలు స్తంభించి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు కావున అండర్ బ్రిడ్జ్ కచ్చితంగా ఏర్పాటు చేయాలని వారు కోరుకుంటున్నారు.
డోన్, బేతంచెర్ల మండలాలలో మైనింగ్ ఎక్కువగా ఉంది సిలికా, ఇనుము, డోలమైడ్, సున్నపు రాయి, రెడ్ ఆక్సైడ్ నాప రాళ్ళ గనులు ఉన్నాయి. ఇక్కడ మైనింగ్ కాలేజ్ పెడతామని గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదు. కనీసం కాలేజీ ఎక్కడ పెట్టాలన్న విషయం కూడా చర్చకు రాలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన దానిని ఎందుకు నెరవేర్చరని పోరాడాల్సిన ప్రతిపక్షం వారు నిలదీయడంలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు మాని అభివృద్ధి గురించి ఆలోచించమని ప్రజలు కోరుకుంటున్నారు.