ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

తూర్పు గొదావరి

కోస్తాఆంధ్ర తీరంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రం కాకినాడ  . 1859 లో రాజమండ్రి జిల్లాను గోదావరి, కృష్ణా జిల్లాలుగా విభజించారు. అంతకు పూర్వం ప్రాంతం బ్రిటీషువారి హాయంలో,  అప్పటి మద్రాస్ రెసిడెన్సీ పాలనలో రాజమండ్రి జిల్లాగా పిలువబడేది. 1925లో గోదావరిజిల్లా తూర్పు, పశ్చిమ  గోదావరి జిల్లాలుగా పునర్విభజన జరిగింది. ప్రస్తుతం రాజమండ్రి  రాజమహేంద్రవరం గా రూపాంతరం చెంది, జిల్లాలో ఒక ప్రముఖ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విహార కేంద్రంగా వెలుగొందుతున్నది. నంద రాజులు, మౌర్యులు, చాళుక్యులుచోళులు , నాయక, రెడ్డి, తెలగరాజులు, ముస్లింలు, బ్రిటీషువారు పాలించిన తూర్పుగోదావరి జిల్లాకు ఘనమైన చారిత్రిక నేపథ్యం ఉంది. ప్రాచీనకాలం నుండే  సంగీత, సాహిత్య , శిల్ప, నాట్యకళలకు  ప్రసిద్ధి చెందిన జిల్లా దేవులపల్లి కృష్ణశాస్త్రీ వంటి ప్రఖ్యాత  కవులకు, మంగళంపల్లి బాల మురళీకృష్ణ, వంటి ప్రసిద్ధ సంగీత విధ్వంసులలకు పుట్టినిల్లు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు జిల్లా పల్లె ప్రాంతాలలో నాటికి సజీవంగా ఉన్నాయి.

2011 లెక్కల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా జనాభా 5151549.  వీరిలో 25,69,419 మగవారు,  25,82,130 మంది మహిళలు ఉన్నారు. 71,35 శాతం అక్షరాస్యతతో ఈ జిల్లా,  రాష్ట్ర సగటు అక్షరాస్యత (65.8%) కంటే ఎక్కువగా ఉంటూ, అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నది. 7 రెవిన్యూ డివిజన్లు  , 64 మండలాలున్న ఈ జిల్లాలో 1,681 గ్రామాలు, 2 మునిసిపల్ కార్పొరేషన్స్, 7 మునిసిపాలిటీలు, 10 సెన్సస్ పట్టణాలున్నాయి.

2015-16  విద్యాశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 5986 పాఠశాలలున్నాయి. ఇందులో 29 ప్రభుత్వ, 3452 మండల మరియు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా, జిల్లాలో ఒక రెసిడెన్షియల్ పాఠశాల,  1688 ప్రవేటు   పాఠశాలలు, రెండు మోడల్. స్కూళ్ళు, 12 కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు, 285 మున్సిపల్ పాఠశాలలు,  ఇంకా వివిధ  మత , ధార్మిక,  నడుపబడే    517 పాఠశాలలున్నాయి.

పర్యాటక ప్రాంతాలు

తూర్పుగోదావరి జిల్లాలో సోమేశ్వరం, అమలాపురం అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం, కోటిపల్లి, పీఠాపురం, రాజమండ్రి, సామర్లకోటలలో చరిత్ర ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు  ఉన్నాయి. ప్రకృతి సిద్దమయిన  సముద్ర తీరం, పచ్చని పంటపొలాలతోబాటు, కోరంగి జంతు సంరక్షణ కేంద్రం , నర్సరీలు, ధవళేశ్వరం వంతెన, సర్. ఆర్థర్ కాటన్  మ్యూజియం, మారేడుమిల్లి వద్దగల ఏకో-టూరిజం ప్రాజెక్టులూ జిల్లాలో ఇతర ప్రసిద్దపర్యాటక ప్రాంతాలు. పాపికొండల మధ్య ప్రవహించే అందాల గోదావరి గురించి యెంత చెప్పినా తక్కువే.రాంపా, తుని, తలుపులమ్మలోవ  వంటి ప్రదేశాలు ప్రక్రుతి రమణీయమైన టూరిస్ట్ ప్రదేశాలుగా రాష్ట్ర పర్యాటకాభివృద్దికి తోడ్పడుతున్నాయి.

Top