ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

గన్నవరం నియోజకవర్గం

కోనసీమలో వసిష్ఠ ,గౌతమి,గోదావరీ నదుల మధ్యలో ఉన్న పాత గన్నవరం నియోజకవర్గం,తూర్పు గోదావరి జిల్లాలోని  19 నియోజకవర్గాలలో ఒకటి. ఈ  నియోజకవర్గంలో పి . గన్నవరం, అంబజీపేట, అయినవిల్లి, మడిదికుడురు మండలాలతో పాటు, మడిదికుడురులోని కొన్ని గ్రామాలు కూడా నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 1,80,080 మంది.

ఇక్కడ సర్ ఆర్ధన్ కాటన్ , బ్రిటిష్ కాలంలో గోదావరిపై  నిర్మించిన ఆకీడెక్ట్ కు నేటికీ ప్రత్యేక గుర్తింపు ఉంది.  అంబాజిపేటలోని కొబ్బరి మార్కెట్ దేశవ్యాప్తంగా ఎగుమతులను అందిస్తుంది, ఇక్కడ తయారయ్యే కొబ్బరి నూనెకు మంచి గిరాకీ ఉంది.

ప్రసిద్ధ ప్రదేశాలు

అయినవిల్లి శ్రీ సిద్ది వినాయక స్వామి ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది. స్వామివారికి నిత్యం గరికతో పూజలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. కొబ్బరి కాయలో స్వయంబుగా వెలిసిన అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయం నియోజకవర్గంలోని మరో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.

ప్రధాన పంటలు

వరి, చెరకు, కొబ్బరి

పారిశ్రామిక ఉత్పత్తులు

బియ్యం, బెల్లం

సమస్యలు

  • గ్రామీణ రోడ్ల విషయంలో తీవ్రమైన అసంతృప్తి.
  • గోదావరి ఒడ్డునే ఉన్నా.. తీవ్రమైన మంచినీటి ఎద్దడి.
  • లంక గ్రామాలలో గోదావరి కోత నివారణకు, గ్రోవెన్స్ నిర్మాణం ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి, పట్టించుకోని ప్రభుత్వం. దశాబ్ధాలుగా గ్రోవెన్స్ కోసం లంక గ్రామాల ప్రజల ఎదురుచూపులు.
  • రెచ్చిపోతున్న ఇసుక మాఫియా .
  • ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ విషయంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత.
  • ఇప్పటికి కార్యరూపం దాల్చని ఉడుమూడిలంక వంతెన.
  • ఎన్నికల హామీగానే మిగిలిపోయిన ముక్తేశ్వరం, పెద్దపట్నం వద్ద హైలెవెల్ కాజ్ వే నిర్మాణం.
Top