ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

రాజమండ్రి రురల్ నియోజకవర్గం

తూర్పు గోదావరి జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలోరాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం ఒకటి. గతంలో ఉన్న కడియం నియోజకవర్గానికి బదులుగా, 2009 శాసనసభల పునర్విభజనలో భాగంగా నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసారు. రాజమహేంద్రవరం , తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరం.

ప్రాంతానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన నగరాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు. ఈ ప్రాంతం, గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలువబడేది. సాహిత్యానికి రాజమహేంద్రవరం పుట్టినిల్లు. నగరంలోనే గొప్ప కవి, నన్నయ తెలుగు లిపిని కనుగొన్నాడు.

ప్రసిద్ధ ప్రదేశాలు:

  • గోదావరి హారతి
  • కాటన్ మ్యూజియం మరియు ఆనకట్ట
  • రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం
  • ఇస్కాన్ శ్రీ కృష్ణ దేవాలయం
  • ఆల్కాట్ గార్డెన్స్
  • నాగుల చెరువు

నియోజకవర్గపు ప్రముఖులు:

  • టంగుటూరి సూర్యకుమారి
  • కుందూరి ఈశ్వరదత్తు - ప్రముఖ పాత్రికేయుడు. ది లీడర్ పత్రిక ప్రధాన సంపాదకుడు.

నియోజకవర్గపు పరిధిలోని సమస్యలు:

  • గోదావరి ఉన్నా నీటి కష్టాలకి కొదవ లేదు.
  • బ్రిటిషు కాలంలో వేసిన పైపులైన్లు, రోడ్డు మధ్యలో ఉండడం వల్ల ఇబ్బందులు.
  • నత్తనడకగా రిజర్వాయిర్ నిర్మాణాలు.
  • అటకెక్కిన పేదల ఇళ్ల నిర్మాణం.
  • రహదారుల విస్తరణ లేమి.
Top