ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పాలకొల్లు నియోజకవర్గం

పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం ఒకటి. పాలకొల్లుకు దుగ్ధోపవనపురం, ఉపమన్యుపురం అనేవి నామాంతరాలు. మహాభక్తుడైన ఉపమన్యుడు ప్రదేశంలో క్షీరాన్ని పొందడంతో ఉపమన్యుపురమనీ, పాలకొలను అనీ పేర్లు వచ్చాయంటారు. పాలకొలను అనే పేరు జనవ్యవహారంలో పాలకొల్లు అయింది. పాలకొల్లు అన్న పేరుకు సంస్కృతీకరణగా క్షీరారామం అన్న వ్యవహారం కూడా ఉంది. నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 170537. అందులో ఆడవారి సంఖ్య 86149 కాగా మగవారి సంఖ్య 84376 గా నమోదయింది

ప్రసిద్ధ ప్రదేశాలు:

  • పంచారామక్షేత్రం
  • లలితకళాంజలి కళాక్షేత్రం.
  • బాలకేంద్రం (మహిళామండలి)

నియోజకవర్గపు ప్రముఖులు:

  • స్వాతంత్ర్య పోరాటములో పాల్గొనిన ప్రముఖ వ్యక్తి అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి.
  • తెలుగులో గజల్ సంగీత, కవితా ప్రక్రియలకు మంచి ప్రజాదరణ తెచ్చిన గజల్ శ్రీనివాస్ కూడా పాలకొల్లు వాడే.
  • మాండొలిన్ వాయిద్యంపై సంగీతాన్ని పలికించడంలో చిన్నతనం లోనే పేరుపొందిన యు.శ్రీనివాస్ జన్మ స్థానం పాలకొల్లు.

నియోజవర్గపు సమస్యలు:

సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

Top