పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో దెందులూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి. దెందులూరుకు పూర్వనామం ఱెన్దుళూర అని శాసనాల వల్ల తెలుస్తోంది. క్రీ.శ.506 నాటి ఱెన్దుళూర శాసనంలో ఈ గ్రామం పేరు ప్రస్తావనకు వస్తోంది. ఱెన్దుళూర అన్న పేరు క్రమంగా దెందులూరుగా మారినట్టు పరిశోధకులు, భాషాశాస్త్రవేత్తలు తేల్చారు. ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 197906. అందులో ఆడవారి సంఖ్య 99821 కాగా మగవారి సంఖ్య 98079 గా నమోదయింది.
గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
వరి, మొక్కజొన్న, చెరకు