ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

రాయచోటి నియోజకవర్గం

రాయచోటి,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పట్టణం. మరియు  రాయచోటి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గం . నియోజకవర్గం1962 లో ఏర్పడినది.

రాయచోటి పట్టణానికి చుట్టుపక్కల గల పల్లెప్రజలు ఇప్పటికీ రాసీడు అనే పలుకుతారు. రాచవీడు అనే పేరు క్రమంగా రాయచోటిగా మారింది. పట్టణంలోని పురాతన వీరభద్రాలయం శైవులకు అత్యంత ప్రీతిపాత్రకరమైనది. ప్రతి సంవత్సరం ఇక్కడ మార్చి నెలలో 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిని వీక్షించడానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.

రాయచోటి పట్టణంలోని వీరభద్రుడు నాగకుండల, రుద్రాక్షమాల శోభితుడై, కుడిచేత జ్ఞానమనే ఖడ్గం, ఎడమచేత అభయమనే ఖేటకం ధరించి భద్రకాళీ సమేతుడై భక్తులకు దర్శనమిస్తారు. అమరుల చేత పూజింపబడటంతో క్షేత్రాన్ని అమరగురు వీరేశ్వర క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కింది. ఆలయ కట్టడాలు చోళ రాజుల శైలిని పోలి ఉన్నాయి. రాజరాజచోళుడు వీరభద్రుడిని దర్శించుకున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.కాకతీయ గణపతిదేవుడు, మట్లిరాజులు, శ్రీకృష్ణదేవారాయలు ఆలయాన్ని దర్శించి అభివృద్ధి పనులు చేయించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. నవాబుల కాలంలో కొంతమంది దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి రాగా మాసాపేట వాసులు అడ్డుకున్నారు. శివరాత్రికి వారి వంశస్థులే గర్భగుడిలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

సెన్సస్ ఇండియా యొక్క తాత్కాలిక నివేదికల ప్రకారం  పులివెందుల జనాభా 236212 మంది ఉన్నారు.

సమస్యలు 

  • వలసలు అరికట్టాలి
  • మెలికలు ప్రాజెక్టును పూర్తి చేయాలి
  • ఝరికోన  రాయవరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
  • డ్రైనేజ్ సమస్యను నిర్మూలించాలి
  • ప్రతిపాదనలకు పరిమితమైన వంద పడకల ఆస్పత్రిని ఆధునిక రించాలి
  • నేషనల్ హైవే లో అవకతవకలు నిర్మూలించాలి
  • రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక రించాలి
Top