ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

టెక్కలి పంచాయితీ

టెక్కలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. టెక్కలి జిల్లా ప్రధాన పట్టణం శ్రీకాకుళం నండి 50 కి.మి దూరములో ఉత్తరాన ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి.రామారావు ఈ నియోజక వర్గమునుండి పోటి చేసి గెలిచాడు, రాష్ట్ర శాసన సభకి ఎన్నిక అయ్యాడు. జిల్లాలో ఉన్న 3 డివిజన్లలో ఇదిఒకటి, ఇది దివిజన్ కేంద్రము,మరియు శాసనసభ నియోజకవర్గము

పేరు వెనక చరిత్ర

టెక్కలి ప్రాంతం 1816నుండి 1832 వరకు పర్లాకిమిడిరాజు గణపతి పద్మనాభదేవ్ పాలనలో వుండేది. అతని కుమారులు ఆ రాజ్యాన్ని రెండుగా విభజించి టెక్కలిని గోవిందనాథ్ దేవ్ నంది గాం ను కృష్ణ చంద్ర దేవ్ లు పాలించారు. టెక్కలి పాలకుడు గోవింద నాథ్ దేవ్ తన కుమార్తెకు వివాహము జరిపించి నప్పుడు పశుపు కుంకుమల క్రింద టెక్కలి గ్రామాన్ని దారా దత్తం చేశాడు. టిక్లి అనగా ఒడియాలో పశుపు కుంకుమల బుట్ట అని అర్థం అలా ఆ గ్రామాన్ని టిక్లి అని పిలిచేవారు. కాల క్రమంలో అది టెక్కలి గా రూపాంతరం పొందింది. (తెలుగు వెలుగు అక్టోబర్ 2008/పుట 97)

ప్రముఖులు

  • కేసిరాజు శ్రీనివాస్
  • కన్నేపల్లి చలమయ్య - ప్రముఖ కథారచయిత.

మునిసిపాలిటీ

రావివలస, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలానికి చెందిన గ్రామము.. టెక్కలి పట్టణానికి 5 కి.మి దూరములో ఈ గ్రామము ఉంది. ఈ గ్రామములో ప్రసిద్ధి చెందిన ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. ఎండల మల్లన్నగా పేరు పడిన ఇక్కడి దైవం మల్లికార్జునస్వామివారు. ఈ దేవుని దర్శించినవారికి దీర్ఘరోగాలు ముఖ్యముగా చర్మరోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాడనమ్మకం. డివిజన్‌, నియోజకవర్గ కేంద్రమైన టెక్కలి మేజర్‌ పంచాయతీ మున్సిపాలిటీ హోదాను సంతరించుకుంది. ప్రతీ డివిజన్‌ కేంద్రాలను మున్సిపాలిటీలుగా మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనలకు టెక్కలి అన్ని హంగులను సమకూర్చుకుంది. 1925 అక్టోబరు 25 బలరాందాస్‌ పట్నాయక్‌ ఆధ్వర్యంలో ఆవిర్భ వించిన టెక్కలి మేజర్‌ పంచాయతీ 2001 జనాభా ప్రాతిప దికన 23 వేల 288 మంది ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగిన టెక్కలి మేజర్‌ పంచాయతీలో ప్రస్తుతం 20 వార్డు లుండగా 53 వీధులున్నాయి40వేల జనాభా ఉన్న ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చాలన్న పంచాయతీరాజ్‌ ఆదేశాలున్నప్పటికీ ప్రభుత్వం ఉత్తర్వులను సవరించి 20వేల జనాభాకు సవరించింది. ఈ నేపథ్యంలో టెక్కలి మేజర్‌ పంచాయతీ ఒక్కటిని మున్సిపాలిటీగా మార్చినప్పటికీ ఆశ్చర్యపోనవసరంలేదు. అయితే, ఇది సరికాదని భావించిన యంత్రాంగం పరిసర పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయనుంది. ఇందులో భాగంగా తోలుసురబల్లి, తిర్లంగి, సీతాపురం, తలగాం, రావివలస, బసువాడ,తేలినీలాపురం, అక్కవరం, బొప్పాయిపురం పంచాయతీలను విలీనం చేయనుంది. దీనిద్వారా 40 వేల పైచిలుకు జనాభాతో మున్సిపాలిటీగా అవతరించనుంది. ప్రస్తుతం మేజర్‌ పంచాయతీ ఏటా 55 లక్షల రూపాయలు ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ పంచాయతీ అభివృద్ధి వినియోగానికే నిధులు ఖర్చవుతున్నాయి. 2001 జనాభా ప్రకారం 4.04 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న పంచాయతీల్లో 5 వేల 979 కుటుంబాలున్నాయని అంచనా. వీటి ప్రకారం టెక్కలి మున్సిపాలిటీగా మారే అవకాశం ఉంది.

టెక్కలి శాసనసభ నియోజకవర్గము వివరాలు

ప్రధాన వ్యాసముటెక్కలి శాసనసభ నియోజకవర్గం

  • సంఖ్యా పరముగా 3వ శాసనసభ స్థానము.
  • ఎన్.టి.రామారావు పోటీ చేసిన ఘనత ఉంది.
టెక్కలి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి