బురగాం శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కంచిలి నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఇచ్ఛాపురం నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 643 ఇళ్లతో, 2481 జనాభాతో 340 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1190, ఆడవారి సంఖ్య 1291. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 251 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల సోంపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల పలాసలోనూ ఉన్నాయి.
బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
ప్రధాన పంటలు: వరి, పెసర
తిత్లీ.. అంతా భయపడినట్లే విరుచుకుపడింది! ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. దాదాపు పన్నెండు గంటలపాటు ఏకధాటిగా విలయతాండవం చేసిన తిత్లీ దెబ్బకు జిల్లా అతలాకుతలమైంది. గతంలో ఇలాంటి సీజన్ల్లోనే దాడి చేసిన ఫైలీన్, హుద్హుద్ తుపానుల కన్నా మితిమీరిన ప్రతాపంతో విరుచుకుపడడంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా ప్రాణాలు గుప్పిట పెట్టుకుని గజగజ వణికిపోయారు. అత్యధికంగా బురగాంలో 24సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. అన్నదాతను తిత్లీ తుపాను నిండా ముంచేసింది. గంటల వ్యవధిలో వెన్ను విరిచేసింది. అపార పంటనష్టం కలిగించి రైతన్నకు తీరని కడుపుకోత మిగిల్చింది. భీకర గాలులు, కుండపోతవర్షానికి బురగాంలో వందల ఎకరాల్లో వరి పంట దెబ్బ తిన్నటు సమాచారం. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో గ్రామంలో చిమ్మచీకట్లు అలుముకున్నాయి.