ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పెదబొండపల్లి పంచాయతీ

పెదబొండపల్లి, విజయనగరం జిల్లా, పార్వతీపురం మండలానికి చెందిన గ్రామము. పెడబొండపల్లి సబ్ జిల్లా హెడ్ క్వార్టర్ పార్వతీపురం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది జిల్లా హెడ్ క్వార్టర్ విజయనగరం నుండి 88 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరలోని శాసనాత్మక పట్టణం 6 కిలోమీటర్ల దూరం లో పర్వతపురం. పెదబొండపల్లి మొత్తం ప్రాంతం 766 హెక్టార్ల, వ్యవసాయేతర ప్రాంతం 77 హెక్టార్లు మరియు టోటల్ సాగునీటి ప్రాంతం 347 హెక్టార్లు. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1,089 ఇళ్లతో, 4,193 జనాభాతో   ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2,045, ఆడవారి సంఖ్య 2,148.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - 1

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల - 3

అంగన్ వాడి కేంద్రములు - 4

గ్రామములో మౌలిక వసతులు

ఒక గ్రామ పంచాయతి కార్యాలయము ఉంది.

ఒక ప్రాథమిక వైద్య/ఆరోగ్య కేంద్రము ఉంది. ఇందులో 10 పడకలు ఉన్నాయి.

సరైన త్రాగు నీటి వసతులు లేవు. ప్రజలు చెరువు, నీటి బావులు, త్రాగు నీటి కొరుకు ఉపయోగించు చున్నారు.

ఒక తపలా కార్యాలయము ఉంది.

ఒక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాశ్ బ్యాంక్ ఉంది.

ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉంది.

శివాలయము

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

రామాలయము

2 ఆంజనేయ స్వామి దేవాలయములు

2 క్రైస్తవ దేవాలయములు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామములో అనేక వ్రుత్తుల ప్రజలు కలరు. ఇందులో ముఖ్యముగా 80% ప్రజలు వ్యవసాయ వ్రుత్తి మీద ఆధార పడినారు. వ్యవసాయ వ్రుత్తి చేయు ప్రజలు పాల ఉత్పత్తి కూడా చేస్తున్నారు.

వ్యవసాయము

పశు పోషణ

వడ్రంగి

గోల్ద్ స్మిత్

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు

ఈ గ్రామం ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి అధ్యక్షుడు మరియు హేతువాది అయిన వంగపండు ప్రసాదరావు స్వస్థలం.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి

చెరకు

నువ్వులు

పెసలు

మినుములు

పార్వతీపురం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి