ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

జర్న పంచాయతీ

జర్నవిజయనగరం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన గ్రామము.

జర్న గ్రామం విజయనగరం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన గ్రామము, ఈ గ్రామము చాలా ఎతైనకొండల పైన ఉన్నది, ఈ కొండలను చాలా దట్టంగా ఉంటాయి అలాగే కొండలపై ఉండేటటువంటి పెద్ద పెద్ద బండరాయిలు మరియు పచ్చనైన చెట్లు చెమలు చాలా బాగా ఆకర్శణీయంగా ఉంటాయి.

నివాశం/గిరిజనులు నివాశం

ఈ గ్రామములోని ప్రజలు మంచి గౌరవమర్యాదలతో నివసిస్తుంటారు, ఈ గ్రామములోని ప్రజలు కొండపోడు పని చేసి వాళ్ల జీవనాని గడుపుతారు, ఈ ప్రజలు కొండల్లో చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని ఉంటారు, ఎందుకంటే వారు తెల్లవారుజాము న లేచి కొండకు వెళ్ళి పగలు పనిచేసి రాత్రిపూటకి ఇళ్లకువచ్చి నిద్రపోతారు.. ఎవరైనా వాళ్ల గ్రామానికి వెళ్లారంటే వాళ్లని గౌరవమర్యాదలతో పలకరించి ఇంటిలోపలికి తీసుకునిపోయి ముందుగా భోజనంపెట్టి తరువాత వాళ్లతో ఎవైనా విషయాలను మట్లాడుకుంటారు

గ్రామములోని ప్రజలు వృత్తి వ్యవసాయం, ఎక్కువగా వరిరాగులుజొన్నలుకందులుపెసలుమినుములు మరియు సోళ్లు (రాగులు) పండిస్తారు. పండ్ల దగ్గరకు వస్తే మా ఊరిలో మూడు కాలాలలో కూడా రకరకాల పండ్లు పండుతాయి సీతాఫలం, అనాసపనస, పనస మరియు మామిడిపళ్ళు వేసవికాలంలో చాలా బాగా దొరుకుతాయి.

తాగు నీరు

గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు

Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి