ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

రాజాం పంచాయతీ

రాజాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది పురపాలక సంఘంగా గుర్తించబడింది. సముద్రమట్టం నుండి ఎత్తు 41 మీటర్లు. (137 అడుగులు).

విద్యా సౌకర్యాలు

పట్టణంలో పలు విద్యాలయాలున్నాయి. రాజాంలో ప్రముఖ సాంకేతిక కళాశాల జియంఆర్ఐటి ఉంది. దీనిలో చదివిన చాలా మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాలలో ఉద్యోగాలు పొందారు. రాజాంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో ఇటీవల ప్రారంభించిన భాష్యం విద్యా సంస్థ, 15 సంవత్సరాలు నాణ్యమైన విద్యను అందించిన శ్రీ బాబా విద్యా నికేతన్ ప్రముఖమైనవి.

వైద్య సౌకర్యం

ఒక సామాజిక ఆరోగ్యకేంద్రం ఉంది. ఈ 60 పడకల ఆసుపత్రి ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ద్వారా నడుపబడుతున్నది. ఇక్కడ ఇటీవల ప్రారంభించిన జియమ్ఆర్-కేర్ హాస్పిటల్ అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు వుపయోగకరంగా ఉంది. త్వరలో ఈ ఆసుపత్రికి అనుసంధానంగా రాజాంలో జియమ్ఆర్ వైద్య కళాశాల నెలకొల్పుతున్నారు.

తాగు నీరు

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

రాజాంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామంలో కలదు. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.  

మార్కెటింగు, బ్యాంకింగు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత లాంటి సౌకర్యాలు.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

పౌర సదుపాయాలు

ఒకప్పుడు వైజాగ్, బొబ్బిలి వైపుగా కేంద్రీక్రుతమైన పట్టణం ఇప్పుడు పాలకొండ, శ్రీకాకుళం వైపుగా అభివ్రుద్ధి చెంది ఆ ప్రాంతం పట్టణ కేంద్రంగా మారిపోయింది. విస్తరణ కారణంగా చుట్టుపక్కల గ్రామాలు పట్టణంలో పూర్తిగా కలిసిపోయాయి. రాజాం నగర పంచాయితీలో అత్యంత ప్రముఖమైన, అతి నివాసయోగ్యమైన ప్రాంతం ఈశ్వరి నారాయణ కాలనీ, బాబా నగర్ కాలనీల సముదాయము. నగర పంచాయితీ పరిధిలో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించి ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలిచింది. పురపాలికగా మారిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ప్రజల ఆహ్లాదం కోసం పార్కు, మెరుగైన సేవలు అందించడానికి ఇ-సేవ త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని విధాల అభివృద్ధి చెందిన రాజాంలో ట్రాఫిక్ సమస్య, పారిశుధ్య సమస్య ఇంకా తీరవలసి ఉంది. దగ్గరలోని రైల్వే స్టేషన్లు - గంగువారిసిగడాం, చీపురుపల్లి.

ఆలయాలు

ఇక్కడ వున్న నవ దుర్గ ఆలయం దేశంలో అత్యంత అరుదైన ఆలయం. ఇదే కాకుండా అనేక దేవతల ఆలయాలతో రాజాం అలరారుతున్నది. ఇక్కడ ప్రతీ ఏడాది పోలిపల్లి పైడితల్లి అమ్మవారి వార్షిక యాత్రా మహొత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇక్కడ చీపురుపల్లి రోడ్డులో గల శ్రీ హనుమాన్ దేవాలయం ప్రసిద్దమైనది. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు మరియు రాజాం ప్రజానీకం మంగళ మరియు శనివారాల్లో ఎక్కువగా ఇక్కడకు వస్తారు.

పలాస నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి