తాజా వార్తలు

ఒక పరోపకారి

సమాజం నుండి తాను పొందిన సహాయానికి బదులుగా ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే దృఢసంకల్పం తో డా. శ్రీనుబాబు సామాజికసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతులకల్పనకు తగిన వనరులను అభివృద్ధి చేయడానికి విశేష కృషి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో అల్లెన, బూర్జ, కీలాంతర, జి. బి. పురం, పెద్దపేట, పాలవలస, మరియు కొత్తపేట మొదలైన ఏడు గ్రామాలు దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాల్లో కలుషితమైన నీరు త్రాగడం వలన క్యాన్సర్ వ్యాథి సంక్రమిస్తుంది. దీనిని నివారించడానికి ఆయన రక్షిత మంచినీరు పథకాన్ని ప్రారంబించారు. ఫలితముగా ప్రస్తుతం అల్లెనకు రక్షిత మంచినీరు అందుతున్నది. శ్రీకాకుళం జిల్లా లోని ఉద్దానంలో కిడ్నీ వ్యాధి పై అవగాహనా సదస్సు కూడా నిర్వహించారు. అక్కడ విద్య, త్రాగు నీరు, వైద్యసేవలు ఇంకా పారిశుద్ద్య పనులకీ అనువుగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు కృషి చేశారు.

 

గ్రామీణప్రాంత విద్యార్ధులలో విద్య పట్ల ఆసక్తి పెంచడానికి డా. శ్రీనుబాబు విశాఖపట్నం లోని ఆంధ్రవిశ్వవిద్యాలయంమరియు శ్రీకాకుళం లోని డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం తో కలిసి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఇంకా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వం తో కలిసి డా. శ్రీనుబాబు ఉపాధి మరియు పారిశ్రామిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ, కొత్త ఉఫాధి అవకాశాలు కలిపిస్తున్నారు.

 

ఇండస్ ఫౌండేషన్, ఆంధ్రవిశ్వవిద్యాలయం, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, యన్ ఐ హెచ్, డా. బీర్ అంబేద్కర్ యూనివర్సిటీ, కే. ఎల్ యూనివర్సిటీ మొదలైన సంస్థలతో కలిసి డా. శ్రీనుబాబు మరియు ఆయన సంస్థలు సైన్స్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒమిక్స్ మరియు దాని అనుబంధ సంస్థలు విదేశీ విద్యావకాశాలు పై తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం, ఫార్మాస్యూటికల్ ఎక్స్ పోర్ట్ కౌన్సిల్, తెలంగాణా మరియు ఆంధ్రా చాంబర్స్ ఆప్ కామెర్స్ మొదలైన సంస్థలతో సంయుక్తంగా హెల్త్ కేర్ మరియు ఫార్మసీకి సంబందించి అంతర్జాతీయ స్థాయి సదస్సులు నిర్వహిస్తున్నారు.

 

‘వైజ్ఞానిక సదస్సుల ద్వారా ఫార్మసీ పరిశ్రమలో నాణ్యమైన రీసెర్చిని ప్రోత్సాహించడంతో బాటు, ఫార్మసీరంగ పరిశ్రమల అభివృద్ధికి ఏటువంటి కృషి అవసరం?' అనే అంశంపై డా. శ్రీనుబాబు తో ముఖాముఖీ కార్యక్రమం.

 

ఇండియన్ అగ్రికల్చర్, క్రాప్ రీసెర్చ్, ఇండియన్ హెల్త్ కేర్, కేన్సర్ పై అవగాహన, ఫార్మసీ రంగంలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు మరియు ఫార్మా పరిశ్రమ వంటి అనేక అంశాలపై సదస్సులు నిర్వహించిన సందర్భం లో పైన వివరించిన అంశాల పై డా. శ్రీనుబాబు తో నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమం.

 

పాఠశాల విద్యాభివృద్ధిలో డా. శ్రీనుబాబు

విద్య విజయానికి పునాదిని వేస్తుంది. ఇది సమాజం పురోగతి కి తోడ్పడుతుంది. దీనికి శాస్త్ర సాంకేతికతో పాటు ఆధునిక సదుపాయాలూ కలిపిస్తే అది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. విద్యార్థిగా తాను పడిన శ్రమ బావి తరాల వారు పడకూడదన్న ఏకైక లక్ష్యంతో డా.గేదెల, శ్రీకాకుళం జిల్లా, పాలకొండలో శ్రీ సత్యసాయి విద్యా సంస్ధలు స్థాపించారు. ఈ పాఠశాలల సముదాయము ప్రాథమిక విద్య మొదలుకొని, ఉన్నత పాఠశాల, జూనియర్ కాలెజీ, డిగ్రీ వరకు స్థానిక విద్యార్థులకు విద్యనందిస్తున్నది. 5000 కు పైగా స్థానిక విద్యార్థులు ఈ విద్యాసంస్థలలో విద్యనభ్యసిస్తున్నారు. డాక్టర్ శ్రీనుబాబు ఎడ్యుకేషనల్ సొసైటీ శిక్షణ పొందిన అధ్యాపకుల సేవలను ఉపయోగించు కుంటూ, ఆధునిక సాంకేతికనుపయోగించి ఆడియో/విజువల్ మరియు ఇతర భోదనాపద్ధతుల ద్వారా విద్యాభివృద్ధి కి తోడ్పడుతుంది.

 

Latest News

Top